పట్టాలిచ్చారు...స్థలాలు మరిచారు!

ABN , First Publish Date - 2021-05-12T17:53:40+05:30 IST

ఇంటి పట్టా మంజూరు ఉత్తర్వులిచ్చి 25 ఏళ్లు దాటిని లబ్ధ్దిదారులకు స్థలాలు అందించని వ్యవహారంలో, 100 కుటుంబాలకు తలా రూ.25 వేలు

పట్టాలిచ్చారు...స్థలాలు మరిచారు!

100 కుటుంబాలకు తలా రూ.25 వేల పరిహారం

ప్రభుత్వానికి హెచ్‌ఆర్సీ ఉత్తర్వులు


చెన్నై/ఐసిఎఫ్‌: ఇంటి పట్టా మంజూరు ఉత్తర్వులిచ్చి 25 ఏళ్లు దాటిని లబ్ధ్దిదారులకు స్థలాలు అందించని వ్యవహారంలో, 100 కుటుంబాలకు తలా రూ.25 వేలు పరిహారంగా అందించాలని రాష్ట్రప్రభుత్వానికి మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్సీ) ఉత్తర్వులు జారీ చేసింది. తిరువళ్లూర్‌ జిల్లా ఆర్‌కే పేట రాజనగరం కాలనీలో నివసిస్తున్న 100 ఆదిద్రావిడ కుటుంబాలకు తలా 3 సెంట్ల స్థం చొప్పున అందజేసేలా పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు పంపిణీ చేసి 25 ఏళ్లు గడచినా స్థలాలు చూపలేదని ఆరోపిస్తూ లబ్ధిదారులు హెచ్‌ఆర్సీలో పిటిషన్‌ దాఖలుచేశారు. పిటిషన్‌ను విచారించిన హెచ్‌ఆర్సీ న్యాయమూర్తి జయచంద్రన్‌ వెలువరించిన తీర్పులో, లబ్ధ్దిదారులకు 25 ఏళ్లుగా స్థలం అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. బాధిత కుటుంబాలకు తలా రూ.25 వేల చొప్పున నెలరోజుల్లో అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, తిరువళ్లూర్‌ జిల్లా కలెక్టర్‌; రెవెన్యూ శాఖ కార్యదర్శిలు ఈ వ్యవహారంపై విచారించి, మూడు నెలల్లో లబ్ధ్దిదారులకు స్థలాలు చూపించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2021-05-12T17:53:40+05:30 IST