నదిలో ఆర్బీకేను ఎలా నిర్మించారు?

ABN , First Publish Date - 2022-08-18T05:36:19+05:30 IST

గతంలో నాగావళి నదిలో నిర్మించిన వెల్‌నెస్‌ సెంట రు కొట్టుకుపోయిన సంగతి తెలిసి కూడా మళ్లీ అక్కడే నూతనంగా ఆర్బీకే భవనం ఎలా నిర్మించారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అధికారులను ప్రశ్నిం చారు.

నదిలో ఆర్బీకేను ఎలా నిర్మించారు?
ఆర్‌బీకే భవన పరిసరాలను పరిశీలిస్తున్న రవికుమార్‌:

 



టీడీపీ జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌


ఆమదాలవలస రూరల్‌ : గతంలో నాగావళి నదిలో నిర్మించిన వెల్‌నెస్‌ సెంట రు కొట్టుకుపోయిన సంగతి తెలిసి కూడా మళ్లీ అక్కడే నూతనంగా ఆర్బీకే భవనం ఎలా నిర్మించారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అధికారులను ప్రశ్నిం చారు.  కలివరంలో నాగవళి నదీ పరివాహక ప్రాంతంలో వరద ఉధృతికి  కొంత భాగం కొట్టుకుపోయిన ఆర్‌బీకే భవనాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి  కలివరంలో ఆర్బీకే నిర్మాణమే నిదర్శనమన్నారు.  ముందుచూపు లేకుండా నాగావళిలో సాక్షాత్తు స్పీకర్‌ తమ్మినేని సీతారాం సమీప గ్రామానికి ఆనుకొని ఇటువంటి నిర్మాణాలు ఎలా చేపట్టారని ప్రశ్నించారు. నాణ్యతప్రమాణాలు పాటించకుండా లేకుండా నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వ ధనం వృథా చేస్తున్నారని ఆరోపించారు. నది పరివాహక ప్రాంతంలో నిర్మాణం చేపట్టకూడదన్న కనీస అవగాహన స్పీకర్‌కు లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్‌టీవాడ గ్రామంలో జగన్నకాలనీ, సచివాలయం నూతన భవనాలు కూడా నదిలోనే నిర్మించారని, నాగావళిలో నీటి ఉధృతి పెరిగితే వీటి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఇటువంటి నిర్మాణాలు జిల్లా ఉన్నతాధికారులు గుర్తించి తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  

పథకాలు పొందడం ప్రాథమిక హక్కు

ఆమదాలవలస:  సంక్షేమ పఽథకాలను పొందడం  అర్హత గల లబ్ధిదారుల  ప్రా ఽథమిక హక్కు అని  టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌  తెలిపారు. బుధవా రం ఆమదాలవలసలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ  వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతోందని,  టీడీపీ సానుభూతిపరులకు సంక్షేమ పథకాలు రాకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. సంక్షేమ పఽథకాలు అర్హత ఉన్న రావడం లేదని, ప్రజలే న్యాయస్థానాలు ఆశ్రయించి పొందు తున్నారని గుర్తు చేశారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం బహిరంగ సభల్లో అర్హతే ప్రామా ణికంగా సంక్షేమ పఽథకాలు అందిస్తున్నామని ఉదరగొడుతున్నారని, మరోపక్క అనుచర గణంతో అర్హత ఉన్నా సంక్షేమ పఽథకాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

రాజకీయ ఒత్తిళ్లు విడనాడాలి

పొందూరు మండలం పిల్లలవలసలో 27 మంది పింఛన్లు తొలగించారని రవికు మార్‌ ఆరోపించారు. టీడీపీ హయాంలో పొందూరులో 6,300, బూర్జలో 4వేలు, సరు బుజ్జిలిలో 4,600 ఇళ్లు, ఆమదాలవలస మండలంలో 3,800 పీఎంఏవై, ఎన్టీఆర్‌ గృహ నిర్మాణంలో  భాగంగా 2,800, మునిసిపాలిటీలో 512 హుద్‌హుద్‌ ఇళ్లు, 524 టిడ్కో ఇళ్లు మంజూరు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వైసీపీ మూడేళ్ల పాలనలో ఒక్క ఇంటినైనా నిర్మించారా అని ప్రశ్నించారు. టీడీపీ సానుభూ తిపరులు ఇళ్ల బిల్లులు నిలుపుదల చేస్తూ వైసీపీ నాయకులు రాక్షసానందం పొందు తున్నారని, ఇటువంటి రాజకీయ ఒత్తిళ్లు విడనాడకపోతే  హౌసింగ్‌ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జడ్పీటీసీ మాజీ సభ్యులు శివ్వాల సూర్యం, కౌన్సిలర్‌ సంపతరావు మురళీధరరావు పాల్గొన్నారు.



 



Updated Date - 2022-08-18T05:36:19+05:30 IST