Ayman al Zawahiri killed: అల్ ఖైదా చీఫ్ జవహరీని ఎలా ట్రాక్ చేశారంటే...

ABN , First Publish Date - 2022-08-02T14:07:32+05:30 IST

గ్లోబల్ టెర్రరిస్టు, అల్ ఖైదా చీఫ్ అల్ జవహరీ అతని కుటుంబంతో కలిసి అఫ్ఘనిస్థాన్ దేశంలోని కాబూల్‌ నగరంలోని రహస్య భవనంలో ఉండగా యూఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు....

Ayman al Zawahiri killed: అల్ ఖైదా చీఫ్ జవహరీని ఎలా ట్రాక్ చేశారంటే...

వాషింగ్టన్ : గ్లోబల్ టెర్రరిస్టు, అల్ ఖైదా చీఫ్(al Qaeda chief) అల్ జవహరీ(Ayman al Zawahiri) అతని కుటుంబంతో కలిసి అఫ్ఘనిస్థాన్(Afghanistan) దేశంలోని కాబూల్‌(kabul) నగరంలోని రహస్య భవనంలో ఉండగా యూఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు(tracked). 2011 సెప్టెంబరు 11 అల్ ఖైదా దాడుల అనంతరం అల్ జవహరీ కదలికలపై అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం సీఐఏ నిఘా వేసింది. జవహరీ తన కుటుంబంతో కలిసి దాక్కున్న భవనాన్ని యూఎస్ ఇంటెలిజెన్స్ గుర్తించి డ్రోన్ దాడికి(drone strike) వ్యూహం పన్నిందని సమాచారం. రెండు దశాబ్దాల ఉగ్రవాదంపై యుద్ధం అనంతరం అప్ఘానిస్థాన్ దేశం నుంచి అమెరికా సేనలు 11 నెలల క్రితం తిరిగి వారి స్వదేశానికి వచ్చాయి. 


జవహరీని హతమార్చే(Ayman al Zawahiri killed) వ్యూహాన్ని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలోని ఐదుగురు కీలక వ్యక్తులు అమలు చేశారని సమాచారం. జవహరీ హత్యకు పథకాన్ని యూఎస్ అత్యంత రహస్యంగా చేసింది.సీనియర్ తాలిబన్ నేత సిరాజుద్దీన్ హక్కానీకి చెందిన ఇంట్లో అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి ఉండగా(ayman al-zawahiri last known location) యూఎస్ డ్రోన్ దాడితో హతమార్చామని యూఎస్ అధికారులు వెల్లడించారు. అమెరికా ప్రజలకు హాని కలిగించిన వారు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ చెప్పారు. 

Updated Date - 2022-08-02T14:07:32+05:30 IST