వైరస్ సోకకుండా వైద్య సిబ్బంది వీటిని ఎలా ధరించాలంటే..

ABN , First Publish Date - 2020-04-08T16:13:38+05:30 IST

కరోనా వైరస్‌ బాధితులకు చికిత్స అందించడంలో వైద్యులు, ఇతర వైద్యసిబ్బంది సేవలు వెలకట్టలేనివి. ప్రాణాలు పణంగా పెట్టి రోగులను కాపాడడానికి వీళ్లు నిత్యం శ్రమిస్తుంటారు. వీళ్లు వైరస్‌

వైరస్ సోకకుండా వైద్య సిబ్బంది వీటిని ఎలా ధరించాలంటే..

ఆంధ్రజ్యోతి(08-04-2020)

ఇలా వేసుకోవాలి!

కరోనా వైరస్‌ బాధితులకు చికిత్స అందించడంలో వైద్యులు, ఇతర వైద్యసిబ్బంది సేవలు వెలకట్టలేనివి. ప్రాణాలు పణంగా పెట్టి రోగులను కాపాడడానికి వీళ్లు నిత్యం శ్రమిస్తుంటారు. వీళ్లు వైరస్‌ సోకకుండా ధరించే యాప్రాన్‌, మాస్క్‌, గాగుల్స్‌, ఫేస్‌ షీల్డ్‌ వంటి వస్తువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ కొన్ని సూచనలు చేసింది. అవేమిటంటే...


పీపీఈ ఎలా ధరించాలంటే...?

పీపీఈ అంటే ‘పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్వి్‌పమెంట్‌’. వైద్యులు, వైద్యసిబ్బంది వీటిని ధరిస్తూ ఉంటారు. 

శిక్షణ పొందిన టీం సభ్యుని పర్యవేక్షణలో పీపీఈ ధరించడం, తీయడం చేయాలి. 

రబ్బరు బూట్లు, ఫ్లూయిడ్‌ రెసిస్టెన్స్‌ బూట్లు మాత్రమే ధరించాలి.

ఏ మాత్రం గాలి కూడా చొరబడని వాటర్‌ప్రూఫ్‌ యాప్రాన్‌ లేదా గౌన్‌ ధరించాలి.

తరువాత నాణ్యమైన మాస్క్‌, గాగుల్స్‌ లేదా ఫేస్‌ షీల్డ్‌ను పెట్టుకోవాలి. 

అందుబాటులో ఉంటే... మొత్తం తలభాగం కవర్‌ అయ్యే విధంగా, హెల్మెట్‌ లాంటి హెడ్‌ కవర్‌ పెట్టుకోవచ్చు.

పీపీఈ ధరించాక చేత్తో ముట్టుకోవడం, సర్దుకోవడం చేయకూడదు. 

ఒకవేళ పీపీఈ రీ యూజబుల్‌ అయితే నిర్దేశించిన స్థలంలో రీప్రాసెసింగ్‌ కోసం ఉంచాలి. 

యూజబుల్‌ది కానట్టయితే వేస్ట్‌ కంటెయినర్‌లో వేయాలి.

ముట్టుకొనే అవసరం లేని థర్మామీటర్లు, థర్మల్‌ ఇమేజింగ్‌ కెమెరాలను వాడాలి.


ధరించాల్సిన వరుస ఇదీ...


గౌన్‌: గౌన్‌ మెడ భాగం నుంచి వీపు భాగం  పూర్తిగా కప్పి ఉండాలి.


మాస్క్‌ లేదా రెస్పిరేటర్‌: మాస్క్‌ ఎలాస్టిక్‌ బ్యాండ్‌లు తల మధ్య భాగంలో ఉండేలా చూసుకోవాలి. ఎలాస్టిక్‌ బ్యాండ్‌లు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. ముఖానికి సరిగ్గా సరిపోయేలా ఉండే మాస్కును ఎంచుకోవాలి.


గాగుల్స్‌ లేదా ఫేస్‌ షీల్డ్‌: ముఖం, కళ్లు పూర్తిగా కవర్‌ అయ్యేలా ఫేస్‌ షీల్డ్‌ ఉండాలి.


గ్లౌజులు: గ్లౌజులు మణికట్టు పూర్తిగా కవర్‌ అయ్యేలా ఉండాలి.


గ్లౌజులు ఎలా తీయాలి!


గ్లౌజుల బయటి భాగం వైర్‌సతో కలుషితమై ఉంటుంది.

గ్లౌజు ధరించి ఉన్న ఒక చేత్తో,ఇంకో అరచేతి ప్రాంతపు గ్లౌజును పట్టుకొని లాగి తీయాలి.

గ్లౌజు ధరించి ఉన్న చేత్తోనే తీసివేసిన గ్లౌజును పట్టుకోవాలి.

ఆ గ్లౌజు సహాయంతో రెండో చేతి గ్లౌజు కూడా తీసేయాలి.

హెడ్‌బ్యాండ్‌ను  వెనకాల పట్టుకొని తలపై నుంచి తీయడం ద్వారా గాగుల్స్‌ లేదా ఫేస్‌ షీల్డ్‌ను తీయాలి.


గాగుల్స్‌ లేదా ఫేస్‌ షీల్డ్‌ ఎలా తీయాలి?

అలాగే గౌన్‌, మాస్క్‌లను తీసేయాలి.


ఇలా చేయండి!

ముఖంపై చేతులు పెట్టుకోకూడదు.

ఆస్పత్రిలో ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టకూడదు. అవసరమైన చోట మాత్రమే ముట్టుకోవాలి.

కలుషితమైనా, చిరిగినా గ్లౌజులు వెంటనే మార్చాలి.

చేతులు ప్రతి క్షణం పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

Updated Date - 2020-04-08T16:13:38+05:30 IST