శానిటైజర్‌ ఇలా వాడాలి!

ABN , First Publish Date - 2020-06-23T05:30:00+05:30 IST

కరోనా కట్టడికి శానిటైజర్ల వాడకానికి అలవాటుపడ్డాం! అయితే ఎలాంటి శానిటైజర్‌ను ఎంచుకోవాలి? ఎలా వాడాలి? అనే విషయాల మీద కూడా అవగాహన ఏర్పరుచుకోవాలి...

శానిటైజర్‌ ఇలా వాడాలి!

కరోనా కట్టడికి శానిటైజర్ల వాడకానికి అలవాటుపడ్డాం! అయితే ఎలాంటి శానిటైజర్‌ను ఎంచుకోవాలి? ఎలా వాడాలి? అనే విషయాల మీద కూడా అవగాహన ఏర్పరుచుకోవాలి. 


సమర్థమైన శానిటైజర్‌: 60ు నుంచి 95ు ఆల్కహాల్‌ కలిసి ఉన్న శానిటైజర్లే సూక్ష్మక్రిములను సమర్థంగా చంపగలవు. ఈ మాత్రం ఆల్కహాల్‌ లేని శానిటైజర్లు అన్ని రకాల సూక్ష్మక్రిములనూ చంపలేవు. అలాగే ఆల్కహాల్‌ శాతం సరిపడా లేని శానిటైజర్లు కొన్ని సూక్ష్మక్రిముల పెరుగుదలను అడ్డుకోగలవు తప్ప, వాటిని వెంటనే చంపలేవు. 

శానిటైజర్‌ వాడకం: శానిటైజర్లు సూక్ష్మక్రిములను చంపడానికి 30 సెకండ్ల సమయం పడుతుంది. కాబట్టి శానిటైజర్‌ను చేతుల్లో వేసుకుని, రుద్దుకున్న వెంటనే, తడిగా ఉన్నప్పుడే తుడిచేసుకోకూడదు. శానిటైజర్‌ చేతుల్లోనే పూర్తిగా ఆరనివ్వాలి.

సబ్బునీళ్లు: మట్టి, జిడ్డు, రసాయనాలు అంటుకున్నప్పుడు శానిటైజర్‌ వాడి చేతులను శుభ్రపరుచుకోవడం సరి కాదు. ఇలాంటప్పుడు సబ్బునీళ్లతో చేతులను కడిగి, ఆ తర్వాత శానిటైజర్‌ ఉపయోగించడం మేలు.


Updated Date - 2020-06-23T05:30:00+05:30 IST