ట్రబుల్‌షూట్‌ ఎలా?

ABN , First Publish Date - 2020-11-28T09:21:04+05:30 IST

వేరే ప్రదేశంలో ఉన్న ఆండ్రాయిడ్‌ ఫోన్‌ని కంట్రోల్‌ లేదా ట్రబుల్‌షూట్‌ చేయడానికీ విఎన్‌సి వ్యూయర్స్‌ యాప్స్‌ పెద్ద మొత్తంలో గూగుల్‌ ప్లే స్టోర్‌లో లభిస్తున్నాయి. అయితే వీటిలో అధిక శాతం వాడడానికి తప్పనిసరిగా మన దగ్గర రూట్‌ చేసిన ఫోన్‌ ఉండాలి. ఒకవేళ ఫోన్‌ రూట్‌ కానిపక్షంలో విఎంలైట్‌ విఎన్‌సి

ట్రబుల్‌షూట్‌ ఎలా?

వేరే ఊర్లో ఉన్న మా అమ్మగారి ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, దాన్ని రిమోట్‌గా ట్రబుల్‌షూట్‌ చేసే మార్గమేదైనా ఉంటే తెలుపగలరు. : ప్రదీప్‌, హైదరాబాద్‌

వేరే ప్రదేశంలో ఉన్న ఆండ్రాయిడ్‌ ఫోన్‌ని కంట్రోల్‌ లేదా ట్రబుల్‌షూట్‌ చేయడానికీ విఎన్‌సి వ్యూయర్స్‌ యాప్స్‌ పెద్ద మొత్తంలో గూగుల్‌ ప్లే స్టోర్‌లో లభిస్తున్నాయి. అయితే వీటిలో అధిక శాతం వాడడానికి తప్పనిసరిగా మన దగ్గర రూట్‌ చేసిన ఫోన్‌ ఉండాలి.  ఒకవేళ ఫోన్‌ రూట్‌ కానిపక్షంలో విఎంలైట్‌ విఎన్‌సి సర్వర్‌ అనేది ఒకటి ఉంది. అయితే దీన్ని వాడాలంటే కనెక్షన్‌ ఎస్టాబ్లిష్‌ చేసే ప్రతీసారి పీసీకి కనెక్ట్‌ చేసి సర్వర్‌ యాక్టివేట్‌ చేయాలి. ఈ గొడవంతా లేకుండా సులభంగా పని పూర్తవ్వాలంటే, టీమ్‌ వ్యూయర్‌ క్విక్‌ సపోర్ట్‌ వాడితే సరిపోతుంది. దీని సాయంతో కూడా అవతలి ఫోన్‌ని రిమోట్‌గా నియంత్రించవచ్చు.

Updated Date - 2020-11-28T09:21:04+05:30 IST