స్మార్ట్‌ఫోన్‌ వదలట్లేదా?

ABN , First Publish Date - 2020-08-12T05:30:00+05:30 IST

పిల్లలకు వీడియోగేమ్‌లు ఆడడం ఒక వ్యసనంగా మారింది. కరోనా సమయంలో ఇంటిపట్టునే ఉండటం వల్ల కొంతమంది పిల్లలు తెల్లారేదాకా మేలుకొని మరీ వీడియోగేమ్‌లు ఆడుతున్నారు...

స్మార్ట్‌ఫోన్‌ వదలట్లేదా?

పిల్లలకు వీడియోగేమ్‌లు ఆడడం ఒక వ్యసనంగా మారింది. కరోనా సమయంలో ఇంటిపట్టునే ఉండటం వల్ల కొంతమంది పిల్లలు తెల్లారేదాకా మేలుకొని మరీ వీడియోగేమ్‌లు ఆడుతున్నారు. మరికొందరు పిల్లలు ఆన్‌లైన్‌ క్లాసులకు డుమ్మాకొట్టి మరీ వీడియోగేమ్‌లు ఆడుతున్నారు. దీనివల్ల చదువులో వెనుకబడడం, నలుగురితో కలవలేకపోవడం, నిద్రలేమీ, మానసిక, భావోద్వేగపరమయిన సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారితో ఎలా వ్యవహరించాలో పిల్లల వైద్య నిపుణులు చెపుతున్నారు. 


  1. కుటుంబం మొత్తానికి వర్తించేలా ఇంటర్నెట్‌ వాడకంపైన పరిమితులు విధించాలి. రోజులో ఫలానా సమయంలో మాత్రమే ఇంటర్నెట్‌ వాడాలి అనే నియమం పెట్టుకోవాలి.  
  2. ఏ విషయమైనా పెద్దలను చూసే పిల్లలు నేర్చుకుంటారు. పెద్దవాళ్లు చేసే పనులను గమనించడం ద్వారా తాము కూడా అలా చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి, పెద్దలు క్రమశిక్షణతో మెలగాలి.
  3. పిల్లల ఇంటర్నెట్‌ వాడకం గురించి నిజాయతీగా వారితో చర్చించండి. సోషల్‌మీడియాలో ఏ వెబ్‌సైట్లను ఎక్కువగా చూస్తున్నారు. ఎలాంటి యాప్‌లను ఎక్కువగా వాడుతున్నారు తెలుసుకోండి. వాటి గురించి పిల్లల తో ముచ్చటించండి. 
  4. తోటివాళ్లతో పోల్చి, మాట్లాడితే పిల్లల్లో ఆత్మన్యూనతాభావం ఏర్పడుతుంది. దీనివల్ల బయటి ప్రపంచంతో కలవకుండా తమకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకొని పిల్లలు అందులో జీవిస్తారు. కఠినంగా శిక్షించడం, కోప్పడటం ద్వారా పిల్లల్లో పూర్తిస్థాయి సామర్థ్యాన్ని వెలికితీయలేమని పెద్దలు గుర్తించాలి. వారికోసం ఒక మంచి వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత కచ్చితంగా పెద్దలదే.

Updated Date - 2020-08-12T05:30:00+05:30 IST