Advertisement
Advertisement
Abn logo
Advertisement

దాచిన విషయం చెప్పక తప్పదా?

ఆంధ్రజ్యోతి(03-03-2020)

ప్రశ్న: మా అబ్బాయికి 29 ఏళ్లు. గత పదేళ్లుగా మానసిక సమస్యకు సంబంధించిన మందులు వాడుతున్నాడు. ఈ విషయం దాచిపెట్టి ఏడాది క్రితం పెళ్లి చేశాం. ఇప్పటివరకూ అబ్బాయి కోడలితో శారీరకంగా కలవలేదు. కారణం అడిగితే కోరికలు, స్తంభనాలు కలగడం లేదని అంటున్నాడు. కోడలు విడాకులు అడుగుతోంది. ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దాలో అర్థం కావడం లేదు. తగిన సలహా ఇవ్వగలరు.

- ఓ సోదరి, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: మానసిక సమస్యకు వాడుతున్న మందుల ప్రభావంతో లైంగిక కోరికలు, స్తంభనాలు తగ్గడం సహజమే. అయితే వాళ్లు శారీరకంగా కలవడం కోసం అకస్మాత్తుగా మందులు ఆపేయడం సరి కాదు. కాబట్టి కోడలికి నిజం చెప్పి, స్తంభనాలు పెరిగేలా వైద్యులు సూచించే మందులు వాడుకోవచ్చు. ఈ విషయంలో కోడలి సహకారం కూడా అవసరం. కాబట్టి మొదట మానసిక వైద్యులను కలిసి మందుల మోతాదు తగ్గించవచ్చేమో అడగండి. అలాగే కోడలిని కూడా వెంటబెట్టుకుని వెళ్లి, లైంగిక కోరికలు, స్తంభనాలు పెరిగేలా వైద్యుల చేత మందులు రాయించుకోండి. పెళ్లి కాదనే భయంతో ఇప్పటివరకూ విషయం దాచిపెట్టినట్టు కోడలికి వివరించండి. ఇతరత్రా ఎలాంటి ఇబ్బందులూ లేని మంచి వ్యక్తి నుంచి, ఈ ఒక్క కారణంతో విడిపోవాలని ఎవరూ కోరుకోరు. కాబట్టి జరిగిపోయిన దాని గురించి చింతించకుండా, ఇప్పుడైనా లౌక్యంగా ఆలోచించి తగినట్టు నడుచుకోండి.


- డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి, ఆండ్రాలజిస్ట్‌

జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌

8332850090 (కన్సల్టేషన్‌ కోసం)

Advertisement
Advertisement