మేకప్‌ చెదరకుండా!

ABN , First Publish Date - 2020-11-22T05:30:00+05:30 IST

ఈరోజుల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే మాస్క్‌ ఉండాల్సిందే. సగానికి పైగా ముఖాన్ని మాస్క్‌ కప్పేసినా, మిగతా సగానికి ఎంతో కొంత మేకప్‌ వేసుకోవాల్సిందే...

మేకప్‌ చెదరకుండా!

ఈరోజుల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే మాస్క్‌ ఉండాల్సిందే. సగానికి పైగా ముఖాన్ని మాస్క్‌ కప్పేసినా, మిగతా సగానికి ఎంతో కొంత మేకప్‌ వేసుకోవాల్సిందే. అయితే చెమట పట్టడం వల్ల ఒక్కోసారి మేకప్‌ చెదిరిపోయి ముఖం పాలిపోయినట్టు కనిపిస్తుంది. అలా జరగకుండా ఏం చేయాలో చెబుతున్నారు మేకప్‌ నిపుణురాలు ప్రియా సురేఖ. ఆమె చెబుతున్న సలహాలివి...


  1. జిడ్డు తొలగించేందుకు: మేకప్‌ ఎక్కువ సమయం నిలిచి ఉండాలంటే ముందుగా ఏం చేయాలంటే ముఖం మీది జిడ్డును బ్లాటింగ్‌ పేపర్‌తో పూర్తిగా తొలగించాలి. చర్మాన్ని మేకప్‌కి సిద్ధంగా చేయాలి. బయటకు వెళ్లినప్పుడు హ్యాండ్‌బ్యాగ్‌లో బ్లాటింగ్‌ పేపర్స్‌ ఉండేలా చూసుకోవాలి. 
  2. నో లిక్విడ్‌ ఫౌండేషన్‌: మెడ, భుజాలు, వీపు భాగంలో ఎక్కడైనా పాలిపోయినట్టుగా ఉంటే సెట్టింగ్‌ పౌడర్‌ రాసుకునే ముందే వాటిని కరెక్టర్‌తో సరిచేసుకోవాలి. పౌడర్‌ ఫౌండేషన్‌ ఎంచుకోవాలి. ఎందుకంటే లిక్విడ్‌, క్రీమ్‌ ఫౌండేషన్‌లో నూనె తక్కువగా ఉంటుంది. ఇవి చెమటను తొందరగా పీల్చుకొంటాయి. మీ చర్మతత్వానికి నప్పే ఫౌండేషన్‌ అయితే బాగుంటుంది.
  3. వాటర్‌ప్రూఫ్‌ ప్రొడక్ట్స్‌: ఎల్లప్పుడూ వాటర్‌ప్రూఫ్‌ ఐ లైనర్‌, కాటుక ఉపయోగించాలి. మీ డ్రెస్సింగ్‌కు సరిపోయేలా నియాన్‌ ఐ లైనర్‌ వాడితే స్టయిల్‌గా కనిపిస్తారు. 
  4. హైలైటర్స్‌ మరచిపోవద్దు: చెక్కిళ్లు, భుజాలు, మెడ వెనుక భాగం దగ్గర హైలైటర్‌తో టచప్‌ చేయాలి. వెలుతురు పడినప్పుడు హైలైటర్‌ మెరుస్తూ కనిపిస్తుంది.
  5. మేకప్‌ స్ర్పే: మేకప్‌ వేసుకోవడం పూర్తయ్యాక సెట్టింగ్‌ స్ర్పే లేదా ఫేస్‌ మిస్ట్‌ ఉపయోగించాలి. సెట్టింగ్‌ స్ర్పే మేకప్‌ చెదరకుండా చూడడమే కాదు, మేకప్‌ మీద రక్షణ పొరలా ఏర్పడి, ఎక్కువ సమయం నిలిచి ఉండేలా చేస్తుంది. 

Updated Date - 2020-11-22T05:30:00+05:30 IST