జుట్టు మళ్లీ పెరగాలంటే..

ABN , First Publish Date - 2021-09-18T18:46:12+05:30 IST

బట్టతల వచ్చేస్తుంటే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. బట్టతల సాధారణ విషయమే అని చెప్పడానికి సులువే కానీ ఆచరణలో మాత్రం ఈజీగా తీసుకోలేరు. బట్టతలను కవర్‌ చేసుకోవడానికి హెయిర్‌ ప్లాంటేషన్‌ వంటి రకరకాల పద్ధతుల వెంట పరుగెడుతుంటారు. నిజానికి హోమ్‌ రెమిడీస్‌ ద్వారా జుట్టు తిరిగి వచ్చేలా చేసుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే..

జుట్టు మళ్లీ పెరగాలంటే..

ఆంధ్రజ్యోతి(18-09-2021)

బట్టతల వచ్చేస్తుంటే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. బట్టతల సాధారణ విషయమే అని చెప్పడానికి సులువే కానీ ఆచరణలో మాత్రం ఈజీగా తీసుకోలేరు. బట్టతలను కవర్‌ చేసుకోవడానికి హెయిర్‌ ప్లాంటేషన్‌ వంటి రకరకాల పద్ధతుల వెంట పరుగెడుతుంటారు. నిజానికి హోమ్‌ రెమిడీస్‌ ద్వారా జుట్టు తిరిగి వచ్చేలా చేసుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే..

రోజూ కొబ్బరినూనెతో తలకు మసాజ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల ఫాలికిల్స్‌ యాక్టివ్‌గా మారి తిరిగి జుట్టు పెరుగుతుంది.

అలొవెరా జెల్‌ను తలకు పట్టించి గంట తరువాత స్నానం చేయాలి. ఈ చిట్కా కూడా బాగా పనిచేస్తుంది. 

ఫిష్‌ ఆయిల్‌లో ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి. డాక్టర్‌ సలహా మేరకు ఈ సప్లిమెంట్స్‌ వాడాలి.

ఉల్లిపాయ జ్యూస్‌ బట్టతలపై జుట్టు పెరిగేలా చేస్తుంది. కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి వాడటం వల్ల కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Updated Date - 2021-09-18T18:46:12+05:30 IST