వేసవిలో ఏసీ, ఫ్రిజ్, కూలర్ రన్ చేసినా కరెంటు బిల్లు తగ్గాలంటే,,,

ABN , First Publish Date - 2022-03-08T14:27:30+05:30 IST

వేసవి కాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలు..

వేసవిలో ఏసీ, ఫ్రిజ్, కూలర్ రన్ చేసినా కరెంటు బిల్లు తగ్గాలంటే,,,

వేసవి కాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు మొదలైనవాటి వినియోగం మరింత పెరుగుతోంది. వేసవిలో ఈ ఉపకరణాల వినియోగంతో కరెంటు బిల్లు అధికంగా వస్తుంటుంది. అటువంటి పరిస్థితిలో విద్యుత్ బిల్లులు తక్కువగా వచ్చేందుకు కొన్ని విధానాలు పాటించాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని అనుసరించడం ద్వారా మీరు ఈ పరికరాలన్నింటినీ ఉపయోగిస్తూ కూడా విద్యుత్ బిల్లులను తక్కువ చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్మార్ట్ డివైజ్‌లను వాడండి

ఈ రోజుల్లో స్మార్ట్ డివైజ్‌లు అనేకం మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ స్మార్ట్ పరికరాలు విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తాయి. ఈ స్మార్ట్ పరికరాలలో స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ బల్బులు, స్మార్ట్ ఏసీలు మొదలైనవి కూడా ఉన్నాయి. వీటి వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది. అలాగే కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది.


ఎల్‌ఈడీ వినియోగం

చాలా మంది ఇప్పటికీ తమ ఇళ్లలో పాత ఫిలమెంట్ బల్బులు, సీఎఫ్‌ఎల్‌లను ఉపయోగిస్తున్నారు. వీటికి ఎక్కువ విద్యుత్ వినియోగమవుతుందని గమనించండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఎల్‌ఈడీ బల్బులను వాడాలి. ఇది మీ విద్యుత్ బిల్లును గణీనీయంగా తగ్గిస్తుంది. 100 వాట్ల ఫిలమెంట్ బల్బ్ 10 గంటలకు 1 యూనిట్ విద్యుత్ తీసుకుంటుంది. అదే సమయంలో 9-వాట్ల LED బల్బు 111 గంటల్లో ఒక యూనిట్ విద్యుత్‌ను తీసుకుంటుంది.

రేటింగ్ చూడండి

మీరు ఫ్రీజ్, ఏసీ తదితర ఉపకరణాలను కొనుగోలు చేసినప్పుడు వాటి రేటింగ్‌పై శ్రద్ధ వహించాలి. 5 స్టార్ రేటింగ్ ఉన్న ఉపకరణాలు తక్కువ విద్యుత్తును గ్రహిస్తాయని తెలుసుకోండి. 5 స్టార్ రేటెడ్ ఉపకరణాల ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇవి విద్యుత్ బిల్లును గణనీయంగా తగ్గిస్తాయి.

మల్టిపుల్ గాడ్జెట్‌ల కోసం పవర్ స్ట్రిప్

ఒకే సమయంలో ఇంట్లో అనేక ఉపకరణాలను ఉపయోగిస్తాం. అటువంటి పరిస్థితిలో మీరు బహుళ గాడ్జెట్‌లను వాడేటప్పుడు పవర్ స్ట్రిప్‌ని ఉపయోగించండి. ఫలితంగా ఈ ఉపకరణాల ఉపయోగం అవసరం లేనప్పుడు వాటిని ఒకేసారి ఆఫ్ చేయడం వలన విద్యుత్‌ను ఆదా చాయవచ్చు. ఫలితంగా కరెంటు బిల్లులో కూడా తేడాలను గమనించవచ్చు.

24 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఏసీని సెట్ చేయండి

ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు గదిని త్వరగా చల్లబరచడానికి చాలామంది ఏసీ ఉష్ణోగ్రతను 18కి లేదా 19కి సెట్ చేస్తారు. దీని వల్ల అధిక విద్యుత్ వినియోగం జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఏసీని ఉపయోగిస్తున్నప్పుడు దాని ఉష్ణోగ్రత 24 డిగ్రీలకు సెట్ చేయండి. ఇది గదిని చల్లగా ఉంచడంతోపాటు విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది. ఇంతేకాకుండా మీరు ఏసీలో టైమర్‌ను కూడా సెట్ చేయవచ్చు. తద్వారా గది చల్లగా ఉన్నప్పుడు ఏసీ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది.

Updated Date - 2022-03-08T14:27:30+05:30 IST