స్ర్కీన్‌టైమ్‌ తగ్గిద్దామిలా...

ABN , First Publish Date - 2021-10-17T05:39:56+05:30 IST

ఫోన్లు, ట్యాబ్‌లు, టివిలు, కంప్యూటర్లు... ఇలా ఇంట్లో ఇన్ని స్ర్కీన్స్‌ ఉండగా పిల్లల చేత స్ర్కీన్‌ టైమ్‌ తగ్గించాలంటే పెద్దలకు కత్తి మీద సామే! అయితే పిల్లల మానసిక ఎదుగుదల మీద ప్రభావాన్ని చూపించే స్ర్కీన్‌ టైమ్‌ను...

స్ర్కీన్‌టైమ్‌ తగ్గిద్దామిలా...

ఫోన్లు, ట్యాబ్‌లు, టివిలు,  కంప్యూటర్లు... ఇలా ఇంట్లో ఇన్ని స్ర్కీన్స్‌ ఉండగా పిల్లల చేత స్ర్కీన్‌ టైమ్‌ తగ్గించాలంటే పెద్దలకు కత్తి మీద సామే! అయితే పిల్లల మానసిక ఎదుగుదల మీద ప్రభావాన్ని చూపించే స్ర్కీన్‌ టైమ్‌ను తెలివిగా తగ్గించే వీలున్న మార్గాలున్నాయి.


ఒంటరిగా కాదు 

పిల్లలను రీల్‌కూ రియల్‌కూ మధ్య తేడా గురించిన అయోమయానికి లోను చేసే స్ర్కీన్‌ టైమ్‌ను ఎలా పరిమితం చేయాలనే విషయంలో పెద్దలకూ అవగాహన ఉండదు. పిల్లలకు స్ర్కీన్‌టైమ్‌ను అనుమతించే క్రమంలో వాళ్ల చేతికి ఫోన్లు అందించే పెద్దలూ ఉంటారు. పరిమితం చేయడం అంటే పిల్లలు ఒంటరిగా ఆడుకోవడానికి వాళ్లకు గ్యాడ్జెట్స్‌ అందించడం కానే కాదు. స్ర్కీన్‌ టైమ్‌ అనేది కేవలం ఫోన్లకు మాత్రమే పరిమితమైనది కూడా కాదు. పిల్లలు టివి చూడడం కూడా స్ర్కీన్‌ టైమ్‌ కిందకే వస్తుంది. కాబట్టి టివి ఆన్‌ చేసి పిల్లలను వదిలేయకుండా, వాళ్లతో పాటు కార్టూన్స్‌ పెద్దలూ చూడాలి. పిల్లలతో కలిసి వాళ్ల నవ్వుల్లో పాలుపంచుకోవాలి.


రాత్రి వేళ వద్దే వద్దు

రాత్రి పడుకునే ముందు స్ర్కీన్‌ టైమ్‌ వల్ల పిల్లలు నిద్రకు సంబంధించిన సమస్యలు ఎదర్కొంటారు. ఇది పెద్దలకూ వర్తిస్తుంది. ఎలకా్ట్రనిక్‌ గ్యాడ్జెట్స్‌ నుంచి వెలువడే నీలం వెలుగు మెదడును చైతన్యంగా ఉంచుతుంది. కాబట్టి వాటిని రాత్రి పూట దూరం పెట్టడమే మంచిది. పిల్లలకు రాత్రివేళ స్ర్కీన్‌ టైమ్‌ తగ్గించడం కోసం, వాళ్లకు కథల పుస్తకాలు అందించాలి. కథలు చదివి వినిపించాలి. 


స్ర్కీన్‌ అడిక్షన్‌ 

పిల్లలు స్ర్కీన్‌ అడిక్షన్‌ బారిన పడడానికి కారణం చాలా చిన్న వయసు నుంచే వాళ్లకు ఎలకా్ట్రనిక్‌ గ్యాడ్జెట్స్‌ను పరిచయం చేయడమే! పిల్లలు ఈ సమస్యకు గురి కాకుండా ఉండాలంటే వాళ్లు మారాం చేసిన ప్రతిసారీ ఫోన్లను వాళ్లకు అందించడం మానేయాలి. బదులుగా బొమ్మలు, ఆటలు, కబుర్లు, డాన్స్‌ లాంటి కాలక్షేపాలను వాళ్లకు అలవాటు చేయాలి. ఏదైనా పని చేయడం ద్వారా పొందే ఆనందం, అనుభూతులను వాళ్లకు అలవాటు చేయాలి.


పెద్దలు తరచి చూసుకోవాలి 

పిల్లలు పెద్దలను అనుకరిస్తారు. పెద్దలు టెక్నాలజీకి వ్యసనపరులైతే పిల్లలు కూడా స్ర్కీన్లకే అతుక్కుపోతారు. కాబట్టి పెద్దలు పిల్లలకు మార్గదర్శకులుగా మారి, ఆరోగ్యకరమైన అలవాట్లను నేర్పాలి. రోజు మొత్తంలో పెద్దలు తమ స్ర్కీన్‌ టైమ్‌ను లెక్కించి, ఆ సమయాన్ని కుదించుకుంటూ ఎక్కువ సమయం పిల్లలతో ఆటపాటలతో గడపాలి

Updated Date - 2021-10-17T05:39:56+05:30 IST