వెన్ను నొప్పి తగ్గేదెలా? సర్జరీతో ఫలితం ఉంటుందా?

ABN , First Publish Date - 2022-07-29T20:11:24+05:30 IST

డాక్టర్‌ తరచూ వెన్ను నొప్పి వేధిస్తోంది. దాంతో రోజువారీ పనులు చేసుకోలేకపోతున్నాను. ఇది జీవనశైలికి

వెన్ను నొప్పి తగ్గేదెలా? సర్జరీతో ఫలితం ఉంటుందా?

డాక్టర్‌ తరచూ వెన్ను నొప్పి వేధిస్తోంది. దాంతో రోజువారీ పనులు చేసుకోలేకపోతున్నాను. ఇది జీవనశైలికి సంబంధించిన సమస్యా, లేక వెన్నుకు సంబంధించిన సమస్యా అనేది తెలియడం లేదు. ఒకవేళ వెన్యు సమస్య అయితే, సర్జరీతో ఫలితం ఉంటుందా? సర్జరీ ఎంతవరకూ సురక్షితం?


ఓ సోదరి, హైదరాబాద్‌


ఎక్కువ సయమంపాటు కుర్చీలో ఒకే భంగిమలో కూర్చుని పని చేయడం వల్ల శరీర భారం వెన్ను మీద పడి, నొప్పి మొదలవ్వవచ్చు. స్థూలకాయులైతే, ఎక్కువ సమయంపాటు నిలబడి పని చేయడం వల్ల శరీర బరువు వెన్ను మీద పడి నొప్పి మొదలవుతుంది. ఈ నొప్పుల బారిన పడకుండా ఉండాలంటే జీవనశైలిలో, అలవాట్లలో, శరీర భంగిమల్లో మార్పులు చేసుకోవాలి. మీ వెన్ను సమస్యకు కారణాలు ఇవే అయితే, వాటిని సరిదిద్దుకోవాలి. అలాగే బరువులు ఎత్తేటప్పుడు మోకాళ్లను వంచి, బరువులు లేపాలి. స్థూలకాయులైతే అధిక బరువు తగ్గించుకోవాలి. ఎక్కువ సమయం కుర్చీలో కూర్చుని పని చేసే ఉద్యోగస్తులైతే, తరచుగా లేచి పది నిమిషాలు నడుస్తూ ఉండాలి. ఒకవేళ వెన్ను సమస్య జీవనశైలి మార్పులతో సరి అయ్యేది కాదని తేలితే, ‘స్పైన్‌ ఎండోస్కోపీ’ శస్త్రచికిత్సను ఆశ్రయించవచ్చు. వెన్ను నొప్పి, డిస్క్‌ ప్రొలాప్స్‌ సమస్యలకు పూర్వం వెన్ను ప్రదేశంలో గాటు పెట్టి సర్జరీ చేసేవారు. కానీ ఇప్పుడు అత్యాధునిక స్పైన్‌ ఎండోస్కోపీ సహాయంతో గాటుతో పని లేకుండా, వెన్ను కండరాలకు నష్టం కలగకుండా, రోగి త్వరగా కోలుకునేలా సర్జరీ ముగించే వీలుంది. ఈ సర్జరీలో సమస్యకు కారణమైన ప్రదేశాన్ని వైద్యులు తేలికగా, స్పష్టంగా గుర్తించి సరిదిద్దే వీలుంటుంది. కాబట్టి వెన్ను నొప్పికి కారణాలను పరిశీలించుకుని, తగిన చికిత్స ద్వారా సమస్యను శాశ్వతంగా అధిగమించే వీలుంది. 


-డాక్టర్‌ సుకుమార్‌ సూర

సీనియర్‌ స్పైన్‌ అండ్‌ న్యూరో సర్జన్‌, హైదరాబాద్‌

Updated Date - 2022-07-29T20:11:24+05:30 IST