మీరు IRCTC పాస్‌వర్డ్‌ను మరచిపోయారా? వెంటనే నిముషాల వ్యవధిలో ఇలా రికవరీ చేసుకోండి!

ABN , First Publish Date - 2022-01-06T16:45:33+05:30 IST

ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడానికి..

మీరు IRCTC పాస్‌వర్డ్‌ను మరచిపోయారా? వెంటనే నిముషాల వ్యవధిలో ఇలా రికవరీ చేసుకోండి!

ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడానికి అనేక రకాల వాహనాలు ఉన్నాయి. వీటిలో కార్లు, బస్సులు, రైళ్లు, విమానాలు మొదలైన ప్రయాణ సాధనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలామంది రైలులో ప్రయాణించడానికి మొగ్గుచూపుతారు. ప్రయాణ సమయంలో పలు సౌకర్యాలు ఉన్నందునే రైలు జర్నీ చేయాలనుకుంటారు. అలాగే సౌకర్యవంతమైన ప్రయాణం కోసం రైళ్లను ఆశ్రయిస్తుంటారు. ఇక రైలు టిక్కెట్ల గురించి ప్రస్తావించాల్సివస్తే.. గతంలో రైలు టిక్కెట్ల కోసం రైల్వే కౌంటర్ల దగ్గర గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఇంట్లో కూర్చొనే ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం ప్రయాణీకులు ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్‌కు చెందిన అధికారిక వెబ్‌సైట్ అంటే IRCTC ద్వారా మీ రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు. అయితే ఇలా టిక్కెట్ బుక్ చేసుకున్నవారిలో చాలమంది పొరపాటున వారి పాస్‌వర్డ్‌ను మర్చిపోవడం జరగవచ్చు. ఫలితంగా వారు టిక్కెట్లను బుక్ చేసుకోలేకపోతారు. మీరు కూడా ఇటువంటి అనుభవాన్ని ఎదుర్కొంటే మీ IRCTC పాస్‌వర్డ్‌ని ఇలా రికవర్ చేసుకోండి.


స్టెప్ వన్

మీరు మీ IRCTC పాస్‌వర్డ్‌ని రికవరీ చేసుకోవాలనుకుంటే మీరు ముందుగా రైల్వే అధికారిక వెబ్‌సైట్ https://www.irctc.co.in/nget/train-searchలోకి వెళ్లాలి.

స్టెప్ టు

అధికారిక వెబ్ సైట్‌లోకి వెళ్లాక ఆ పేజీ ఎగువ భాగంలో కనిపించే లాగిన్‌పై క్లిక్ చేయాలి. తరువాత మీరు ఫర్‌గెట్ పాస్ వర్డ్‌పై క్లిక్ చేయాలి

స్టెప్ త్రీ

ఫర్‌గెట్ పాస్ వర్డ్‌పై క్లిక్ చేశాక.. IRCTC ID, పుట్టిన తేదీ క్యాప్చా కోడ్ లాంటి అవసరమైన సమాచారాన్ని పూరించాలి. 

స్టెప్ ఫోర్

అవసరమైన సమచారాన్ని అందించాక.. పాస్‌వర్డ్‌ను రికవర్ చేయడానికి సంబంధించిన వివరాలు మీ రిజిస్టర్డ్ ఈ మెయిల్ ఐడికి పంపబడతాయి. దానిని ఉపయోగించి మీరు మీ పాస్‌వర్డ్‌ని రికవర్ చేయవచ్చు. ఆ తరువాత మీరు IRCTC ద్వారా మీ ప్రయాణానికి సంబంధించిన రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

Updated Date - 2022-01-06T16:45:33+05:30 IST