Love In Relationship: రిలేషన్ షిప్ లో ప్రేమను పెంచుకోండిలా..

ABN , First Publish Date - 2022-07-29T21:27:06+05:30 IST

ఒకరితో ఒకరు గడపడానికి ప్రేమతో పాటు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. కొన్నిసార్లు దగ్గరగా ఉన్నా కూడా ఒకరికొకరు దూరంగా ఉంటారు.

Love In Relationship: రిలేషన్ షిప్ లో ప్రేమను పెంచుకోండిలా..

పెళ్లయిన మొదట్లో చాలా ప్రేమతో ఉన్నామని తర్వాత రోజులు గడిచే కొద్దీ మా మధ్య ప్రేమ తగ్గిపోయిందని చాలామంది ఆడవారిలో ఉన్న సందేహం. అసలు ప్రేమ తరిగిపోవడాన్ని ఫిర్యాదుగా కాకుండా తమవంతు ప్రేమను పెంచేందుకు ఏం చేస్తున్నారో ఆలోచించాల్సిన అవసరం భార్యాభర్తలు ఇద్దరి మీదా ఉంది. ఒకరితో ఒకరు గడపడానికి ప్రేమతో పాటు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. కొన్నిసార్లు దగ్గరగా ఉన్నా కూడా ఒకరికొకరు దూరంగా ఉంటారు. ఒకరి ఇష్టాలు, అయిష్టాలు మరొకరు అర్థం చేసుకోరు. దీనికి వీళ్ళు కలిసి చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఇవి ప్రేమను పరస్పరం పంచుకునేలా చేస్తాయంటున్నారు నిపుణులు. అది ఎలాగో తెలుసుకుందాం.


Mindfulness: మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్ కావాలి.


1. ఉదయం టీని కలిసి తాగండి. ఉదయం చాలా అందంగా ఉంటుంది. ఇంకా ప్రశాంతంగా మీ రోజును ప్రారంభించండి. చాలావరకూ మీ రోజువారి పని కాఫీ లేదా టీ తాగిన తరువాత మొదలవుతుంది కాబట్టి ఆ సమయాన్ని మీ భాగస్వామితో పంచుకుంటే ఆనందంగా మీరోజు ప్రారంభించినట్టే.. దీనితో పాటు కమ్మని సంగీతాన్ని వింటూ ఆ సమయాన్ని గడిపితే ఆ క్షణాలను మరింత అందంగా మార్చుకోవచ్చు. 


Share the screen together: కలిసి స్క్రీన్ ని పంచుకోండి. 


2. సమయం దొరికినప్పుడల్లా కలిసి సినిమా చూడండి. సిరీస్‌లు, కామెడీ షోలను కలిసి చూడండి. ఇది ఒకరికొకరు కొన్ని అందమైన క్షణాలను గడపడానికి సహాయపడుతుంది. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది. 


ఇద్దరి మధ్య దగ్గరితనం అవసరం: 


3. చిన్న చిన్న పనులు చేయండి: కొంతకాలం తర్వాత ఇద్దరిమధ్యా దగ్గరితనం తగ్గుతుందనే అనుమానం కలిగినపుడు భార్యాభర్యర్తలకు జీవితంలో కొత్తగా ఏమీ అనిపించదు. అలాంటప్పుడు చిన్న చిన్న సాయాలు చేసుకోండి. తలకు నూనె పట్టించడం, తల స్నానం చేసాకా తుడవడం లాంటి పనులు ఇద్దరిమధ్యా దగ్గరితనాన్ని తెస్తాయి. ప్రేమ కూడా పెరుగుతుంది. 

Updated Date - 2022-07-29T21:27:06+05:30 IST