వాతావరణ పట్టిక!

ABN , First Publish Date - 2020-06-19T05:30:00+05:30 IST

ఏడాదిలో రకరకాల వాతావరణ పరిస్థితులు ఉంటాయని మీకు తెలుసు కదా! మరి ఏయే కాలంలో వాతావరణం ఎలా ఉంటుందో సులువుగా అర్థమయ్యేలా ఒక పట్టిక తయారుచేద్దామా...

వాతావరణ పట్టిక!

ఏడాదిలో రకరకాల వాతావరణ పరిస్థితులు ఉంటాయని మీకు తెలుసు కదా! మరి ఏయే కాలంలో వాతావరణం ఎలా ఉంటుందో సులువుగా అర్థమయ్యేలా ఒక పట్టిక తయారుచేద్దామా! 


కావలసినవి:

  1. ఒక పెద్ద చార్ట్‌ పేపర్‌
  2. కొన్ని పేపర్‌ షీట్స్‌
  3. కత్తెర
  4. కలర్స్‌
  5. పెన్సిల్స్‌
  6. జిగురు


ఇలా చేయాలి!

  1. ముందుగా బోర్డుపై పెద్ద చార్ట్‌ను అతికించండి.
  2. తరువాత పేపర్స్‌పై కాలాలకు సంబంధించిన బొమ్మలు గీయండి. 
  3. వర్షాకాలం అయితే రెయినీ సీజన్‌ అని రాసి, మేఘాల బొమ్మలు గీయండి.
  4. వేసవికాలం అయితే సమ్మర్‌ సీజన్‌ అని రాసి, సూర్యుడి బొమ్మ వేయండి. వాటికి అనుగుణంగా రంగులు వేయండి.
  5. ఇలా అన్ని కాలాల బొమ్మలు గీసి, రంగులు వేసి అతికించండి.
  6. ఒక పేపర్‌పై బాణం గుర్తు గీసి నీట్‌గా కట్‌ చేయండి. 
  7. ఏ సీజన్‌లో ఉంటే అక్కడ బాణం గుర్తును అతికించండి. 

అంతే.. వెదర్‌ చార్ట్‌ రెడీ. 


Updated Date - 2020-06-19T05:30:00+05:30 IST