మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ ఓపెన్‌ కోసం ఏమి చేయాలి?

ABN , First Publish Date - 2021-01-16T05:30:00+05:30 IST

నేను విండోస్‌ 10 వాడుతున్నాను. అందులో మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ ఓపెన్‌ కావడం లేదు. సొల్యూషన్‌ తెలుపగలరు...

మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ ఓపెన్‌ కోసం ఏమి చేయాలి?

నేను విండోస్‌ 10 వాడుతున్నాను.  అందులో మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ ఓపెన్‌ కావడం లేదు.  సొల్యూషన్‌ తెలుపగలరు. 

-  యుగంధర్‌.కె, యలమంచిలి


మీ కంప్యూటర్లో తాజా అప్డేట్లు ఇన్‌స్టాల్‌ అయి ఉన్నాయో లేదో చెక్‌ చేయండి.  కొన్ని సందర్భాల్లో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ  సక్రమంగా లేకపోవడంతో ఈ సమస్య ఎదురవుతుంది.  అలాగే  మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ వాడాలంటే తప్పనిసరిగా మీ మైక్రోసాఫ్ట్‌ ఎకౌంట్లోకి లాగిన్‌ కావలసి ఉంటుంది.  ఒకవేళ మీ కంప్యూటర్లో సిఎంఓయస్‌ బ్యాటరీ లోపం వల్ల టైమ్‌, డేట్‌ సెట్టింగ్స్‌ మారిపోయి ఉన్నట్లయితే అప్పుడు కూడా మీకు మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ ఓపెన్‌ కాదు. 


Updated Date - 2021-01-16T05:30:00+05:30 IST