ఇంటి గదులు కొత్తగా..!

ABN , First Publish Date - 2020-02-24T08:19:30+05:30 IST

ఇల్లు ఆకర్షణీయంగా కనిపించాలంటే రంగుల దగ్గర నుంచి వస్తువుల అమరిక వరకు కాస్త శ్రద్ధ పెడితే చాలు. పెద్దగా ఖర్చు లేకుండా ఇంటికి కొత్త లుక్‌ను తీసుకురావచ్చు. ఆ చిట్కాలు ఇవి...

ఇంటి గదులు కొత్తగా..!

ఇల్లు ఆకర్షణీయంగా కనిపించాలంటే రంగుల దగ్గర నుంచి వస్తువుల అమరిక వరకు కాస్త శ్రద్ధ పెడితే చాలు. పెద్దగా ఖర్చు లేకుండా ఇంటికి కొత్త లుక్‌ను తీసుకురావచ్చు. ఆ చిట్కాలు ఇవి...

  • * ఇంట్లో అన్ని గదులకు తెలుపు రంగు లేదా ఒకే రంగు వేయడం వల్ల ఆకర్షణీయంగా కనిపించదు. అలా కాకుండా గదిలో ఒక గోడకు ముదురు రంగు వేయిస్తే ఆ గది లుక్‌ మొత్తం మారిపోతుంది. పడకగదిలో లేదా హాల్‌లో ఏదైనా ఒక గోడకు ముదురు రంగు వేసుకోవచ్చు.
  • * సోఫాలో లేదా కుర్చీలో ఉన్న పిల్లో కవర్లు మార్చుకుంటే గది వాతావరణం కొత్తగా కనిపిస్తుంది. పిల్లో కవర్ల రంగులు ఎంచుకోవడంలోనూ కొంచెం శ్రద్ధ పెట్టాలి. అన్ని ఒకే రంగువి కాకుండా ఒక్కో పిల్లో కవర్‌ ఒక్కో రంగులో ఉండేలా చూసుకోవాలి.
  • * సీజన్‌కు అనుగుణంగా ఇంట్లో కర్టెన్లు మార్చుకోవాలి. పరదాల రంగులు కూడా ఇంటికి కొత్త అందం తీసుకొస్తాయి.
  • * హాల్‌లో గోడకు వేలాడదీసే పెయింటింగ్‌, వాల్‌క్లాక్‌ను మార్చుకోవడం ద్వారా న్యూ లుక్‌ తేవచ్చు. గది మూలల్లో మొక్కల కుండీలు పెట్టుకున్నా కొత్త శోభ సంతరించుకుంటుంది.
  • * లైటింగ్‌ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొత్త లుక్‌ తీసుకురావచ్చు. బుక్‌ షెల్ఫ్‌లో, గది మూలలో రంగు రంగుల లైటింగ్‌ ఏర్పాటు చేసుకుంటే ఇల్లంతా ఆకర్షణీయంగా ఉంటుంది.

Updated Date - 2020-02-24T08:19:30+05:30 IST