ఆవు పేడను కలపగా, ఇటుకలుగా మార్చే యంత్రం గురించి మీకు తెలిస్తే..

ABN , First Publish Date - 2022-05-08T17:31:49+05:30 IST

ఆవు పేడ ఉపయోగాలు గురించి మీరు వినే ఉంటారు...

ఆవు పేడను కలపగా, ఇటుకలుగా మార్చే యంత్రం గురించి మీకు తెలిస్తే..

ఆవు పేడ ఉపయోగాలు గురించి మీరు వినే ఉంటారు. ఇప్పుడు ఆవు పేడతో పిడకల తయారీ మాత్రమే కాదు అగరబత్తీలు, సంచులు, ఫ్రేమ్‌లు, కార్డ్‌బోర్డ్, అలంకరణ వస్తువులు మొదలైన వాటితో సహా 100కు మించిన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. గతేడాది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఆవు పేడతో తయారు చేసిన పెయింట్‌ను ప్రారంభించారు. ఇప్పుడు ఈ పేడతో కలప, ఇటుకలు కూడా తయారు చేస్తున్నారు. ఆవు పేడతో కలప, ఇటుకలను తయారు చేసే గోకాస్ట్ మెషిన్‌ను సిద్ధం చేశారు.




కేంద్ర ప్రభుత్వం దీనికి ప్రచార రూపం ఇచ్చింది. మే 6న కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ప్రాజెక్ట్ ఎర్త్ కింద ఐఐటీ ఢిల్లీ విద్యార్థులకు ఈ యంత్రాన్ని అందజేశారు. PBNS నివేదిక ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన “గో కాష్ట్ అభియాన్” మించి ఫలితాలనిస్తోంది. ఈ ప్రచారంలో ఆవు పేడతో కలప ఇటుకల తయారీకి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఇది రైతులు, మహిళలు, గోశాలలు నడుపుతున్న ప్రజల జీవితాల్లో అనేక మార్పులను తీసుకురానుంది. గోకాస్ట్ యంత్రం ద్వారా పాడి రైతులు కలపతో పాటు ఇటుకలు తయారుచేయవచ్చు. ఈ యంత్రం రాకతో వ్యర్థ పేడ ఉపయోగకరంగా మారింది. ఈ యంత్రం సాయంతో 3 క్వింటాళ్ల ఆవు పేడ నుండి 1500 కిలోల కలప తయారు చేయవచ్చు. ఈ కలప పర్యావరణకు స్నేహ పూర్వకంగా ఉంటుంది. ఈ కలపను మృతదేహాలను దహనం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. 

Read more