భలే గుడ్లగూబ

ABN , First Publish Date - 2020-12-01T05:30:00+05:30 IST

ఫోమ్‌ షీట్లతో గుడ్లగూబ తయారీ

భలే గుడ్లగూబ

కావలసినవి

ఫోమ్‌ షీట్లు - ఏడు (పింక్‌, బ్లూ, వైట్‌, బ్లాక్‌, రెడ్‌, ఎల్లో, గ్రీన్‌), కత్తెర, జిగురు, గూగ్లీ కళ్లు, స్కెచ్‌పెన్ను.


తయారీ విధానం

  1. ముందుగా బొమ్మలో చూపించిన విధంగా ఫోమ్‌ షీట్‌పై స్కెచ్‌ పెన్ను సహాయంతో బొమ్మగీయండి.
  2. గుడ్లగూబ శరీరం కోసం అవుట్‌లైన్‌ గీయండి. 
  3. బ్లూ షీట్‌పై ముఖం, మెడ గీయండి.
  4. పింక్‌ షీట్‌పై గుండె బొమ్మ గీసి కత్తిరించండి. రెండు వైట్‌ సర్కిల్స్‌, రెండు గ్రీన్‌ సర్కిల్స్‌, రెండు పసుపు పాదాలు, రెండు చిన్న త్రిబుజాలు గీసి కత్తిరించండి. ఒకటి ఎరుపు, మరొకటి పుసుపు షీట్‌పై గీయండి. పింక్‌, బ్లూ షీట్‌ను జుట్టు కోసం కత్తిరించండి.
  5. టేబుల్‌పై రెడ్‌ అవుట్‌లైన్‌ షీట్‌ను పెట్టండి. దానిపైన కిందిభాగంలో పింక్‌ హార్ట్‌ను అతికించండి.
  6. ఇప్పుడు వాటిపై బ్లూ కట్‌అవుట్‌ను బొమ్మలో చూపించిన విధంగా అతికించండి.
  7. పైభాగంలో జుట్టుకోసం కత్తిరించిన పింక్‌, బ్లూ షీట్‌లు అతికించండి.
  8. కళ్ల కోసం తెలుపు సర్కిల్స్‌ అతికించండి. వాటిపై గ్రీన్‌ సర్కిల్స్‌ అంటించండి. తరువాత వాటిపై గూగ్లీ కళ్లు అంటించండి.
  9. ఎరుపు, పసుపు త్రిభుజాలతో ముక్కు తయారుచేయండి.
  10. కింద పసుపు పాదాలు అంటిస్తే గుడ్లగూబ బొమ్మ రెడీ.

Updated Date - 2020-12-01T05:30:00+05:30 IST