ఆరోగ్యంతో పాటు అందంగా కనిపించాలంటే..

ABN , First Publish Date - 2020-03-07T17:18:09+05:30 IST

వేసవిలో ఒంట్లో నీరు తగ్గి నిస్సత్తువ ఆవరిస్తుంది. అలాంటప్పుడు వాటర్‌మెలన్‌ తింటే

ఆరోగ్యంతో పాటు అందంగా కనిపించాలంటే..

వారెవ్వా... వాటర్‌మెలన్‌!

వేసవిలో ఒంట్లో నీరు తగ్గి నిస్సత్తువ ఆవరిస్తుంది. అలాంటప్పుడు వాటర్‌మెలన్‌ తింటే ఒంటికి చల్లదనంతో పాటు శక్తి అందుతుంది. నీటితో నిండిన ఈ పండు ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచుతుంది. వర్కవుట్‌ తరువాత స్నాక్‌గా తింటే సత్వరమే శక్తి వస్తుంది. ఈ సీజన్‌లో తినదగ్గ పండ్లలో ఒకటైన పుచ్చకాయ వల్ల కలిగే లాభాలివి... 


* వేసవిలో ఎండ తాపానికి ఒంట్లో కోల్పోయిన నీరు పుచ్చకాయ తినడంతో తిరిగి చేరుతుంది. దాంతో డీహైడ్రేషన్‌ సమస్య ఎదురవ్వదు. 

* విటమిన్‌ ఎ ఎక్కువ మోతాదులో ఉన్నందున కంటికి ఎంతో మంచిది. 

* దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణనిస్తాయి. 

* సహజ చక్కెరలతో కూడిన వీటిలో కొలెస్ట్రాల్‌, కొవ్వు, క్యాలరీలు తక్కువ.

* పుచ్చకాయ తింటే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.

* వాటర్‌మెలన్‌లోని విటమిన్‌ సి గుండె కండరాలు గట్టిపడడాన్ని నిరోధిస్తుంది. ఫలితంగా రక్తపీడనం అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

* పుచ్చకాయలోని లైకోపిన్‌ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ పురుషుల్లో ప్రొస్టేట్‌ కేన్సర్‌ ముప్పును తగ్గిస్తుంది. 

* విటమిన్‌ బి1 ఎక్కువ మోతాదులో ఉండే వీటిని తింటే నాడీవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. 

* టేబుల్‌ స్పూన్‌ చొప్పున పుచ్చకాయ రసం, యోగర్ట్‌ కలపి ముఖానికి రుద్దుకుంటే చర్మం తాజాదనాన్ని పొందుతుంది. 

* వీటిలోని అరుదైన అమినో ఆమ్లం సిట్రుల్లిన్‌, అర్జినిన్‌లు రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. 

* వర్కవుట్‌ తరువాత స్నాక్‌గా వాటర్‌మెలన్‌ తింటే కండరాల అలసట తగ్గుతుంది. చెమట రూపంలో కోల్పోయిన మెగ్నీషియం, పొటాషియం తిరిగి చేరడంతో ఎనర్జీ నిండుతుంది. 

* వాటర్‌మెలన్‌లోని బీటా-క్రిప్టోక్జాంతిన్‌ కీళ్లలో వాపును నివారిస్తుంది. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వచ్చే అవకాశాల్ని తగ్గిస్తుంది.

Updated Date - 2020-03-07T17:18:09+05:30 IST