లింకైనట్లు తెలుసుకోవడం ఎలా?

ABN , First Publish Date - 2020-09-12T05:30:00+05:30 IST

నా ఫోన్‌ నెంబర్‌ ఏదైనా యాప్‌, వెబ్‌సైట్‌లో లింక్‌ అయినట్లు తెలుసుకోవడం ఎలా?

లింకైనట్లు తెలుసుకోవడం ఎలా?

నా ఫోన్‌ నెంబర్‌ ఏదైనా యాప్‌, వెబ్‌సైట్‌లో లింక్‌ అయినట్లు తెలుసుకోవడం ఎలా?  

- వేముల వెంకటేష్‌


ఏదైనా వెబ్‌సైట్లో గానీ, యాప్‌లో గానీ రిజిస్టర్‌ చేసుకునేటప్పుడు కేవలం అథంటికేషన్‌ కోసం మీకు ఓటిపి పంపిస్తారు. అలా ఓటిపి పంపించి టెలికాం సంస్థలు తమ బాధ్యత పూర్తి చేస్తాయి. అంతే తప్పించి ఆ ఓటిపిలను ఏయే యాప్స్‌ పంపాయి, ఏ సైట్లు పంపాయి అన్నది ట్రాక్‌ చేసే అవకాశం వాటి దగ్గర ఉండదు. ఎస్‌ఎంఎస్‌ గేట్‌వేలను ఉపయోగించే ఏ అప్లికేషన్‌ అయినా మనకు ఆథరైజేషన్‌ మెసేజ్‌లు పంపగలుగుతుంది. కాబట్టి మీ నెంబర్‌తో వాడుతున్న యాప్స్‌, సైట్ల వివరాలు అంత ముఖ్యం అనుకుంటే మీరు ఒక చోట రాసిపెట్టుకోవాలి. అంతే తప్పించి దానికంటూ ప్రత్యేకమైన ఏర్పాటు ఏదీ ఉండదు.


మీ టెక్‌ సందేహాలకు సమాధానాల కోసం navya@andhrajyothy.com

Updated Date - 2020-09-12T05:30:00+05:30 IST