ఇమ్యూనిటీ... ఇలా!

ABN , First Publish Date - 2020-04-21T16:42:14+05:30 IST

కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందాలంటే వ్యాధినిరోధకశక్తిని మెరుగ్గా ఉంచుకోవాలి అనే విషయం అందరికీ తెలిసిందే! ఆరోగ్యానికి రక్షణ కవచంగా పని చేసే వ్యాధినిరోధకశక్తిని

ఇమ్యూనిటీ... ఇలా!

ఆంధ్రజ్యోతి(21-4-2020)

కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందాలంటే వ్యాధినిరోధకశక్తిని మెరుగ్గా ఉంచుకోవాలి అనే విషయం అందరికీ తెలిసిందే! ఆరోగ్యానికి రక్షణ కవచంగా పని చేసే వ్యాధినిరోధకశక్తిని బలపరుచుకోవడానికి ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడంతో పాటు, కొన్ని ఆరోగ్య సూత్రాలు కచ్చితంగా పాటించాలి!


ఒత్తిడితో జీర్ణవ్యవస్థలో లోపాలు, హృద్రోగాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అంతటి తీవ్ర రుగ్మతలకు పరోక్షంగా కారణమయ్యే ఒత్తిడి, వ్యాధినిరోధకశక్తిని కుంటుపరిచి, తేలికగా వ్యాధులకు గురి చేయదు అనుకోవడంలో అర్థం లేదు. అయితే ఒత్తిడి ఎంతో కొంత ఉండడం సామర్థ్య నిరూపణకు అవసరమే! అయితే ఆ ఒత్తిడి తీవ్రత, కొనసాగే కాలాలను బట్టి, దాని ప్రభావం వ్యాధినిరోధకశక్తి మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే ఒత్తిడి అందరిలోనూ ఒకేలా, సమానంగా ఉండకపోవచ్చు. ఒత్తిడికి లోను చేసే విషయాల్లో కూడా వ్యక్తుల మధ్య తేడాలు ఉండవచ్చు. కాబట్టి జీవన నాణ్యతను దెబ్బతీసేలా ఉంటే, ఆ ఒత్తిడి కచ్చితంగా వ్యాధి నిరోధకశక్తిని కుంటుపరుస్తుంది అని గ్రహించాలి. కాబట్టి అలాంటి ఒత్తిడికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి.



ఆరోగ్య సూత్రాలు!


పళ్లు, కూరగాయలు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి.


క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.


శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి.


సరిపడా నిద్ర తప్పనిసరి.


ఒత్తిడిని తగ్గించుకోవాలి.


శరీర శుభ్రత పాటించాలి.

Updated Date - 2020-04-21T16:42:14+05:30 IST