బ్యాటరీకి ‘లైఫ్‌’

ABN , First Publish Date - 2021-09-15T05:31:05+05:30 IST

స్మార్ట్‌ ఫోన్‌ను వేలు, లక్షలు పోసి కొంటారు. అయితే బ్యాటరీ లైఫ్‌ను రక్షించటంలో ఎక్కువ శాతం మంది జాగ్రత్తలు పాటించరు. ఫోను కొన్న సంవత్సరానికే బ్యాటరీ డ్రైన్‌ అవుతుంటుంది...

బ్యాటరీకి ‘లైఫ్‌’

స్మార్ట్‌ ఫోన్‌ను వేలు, లక్షలు పోసి కొంటారు. అయితే బ్యాటరీ లైఫ్‌ను రక్షించటంలో ఎక్కువ శాతం మంది జాగ్రత్తలు పాటించరు. ఫోను కొన్న సంవత్సరానికే బ్యాటరీ డ్రైన్‌ అవుతుంటుంది. శక్తి లేకుంటే మనిషి ఎలా నడవలేడో.. బ్యాటరీ ఆరోగ్యంగా లేకుంటే స్మార్ట్‌ఫోన్‌ కూడా అంతే. బ్యాటరీ లైఫ్‌ బాగుండాలంటే.. ఈ టిప్స్‌ తప్పనిసరి. 


  1. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ అంటే..  పెద్ద డిస్‌ప్లే పరిమాణం, అధిక కెమెరా పిక్సల్స్‌, 128 జీబీ స్టోరేజ్‌, పెద్ద బ్యాటరీ ఉండాల్సిందే. ముందుగా డిస్‌ప్లే విషయాన్ని తీసుకుంటే.. అరవై నుంచి ఎనభై శాతం వరకు బ్రైట్‌నెస్‌ సెట్‌ చేసుకుంటే సరి. అలా కాకుండా వంద శాతం బ్రైట్‌నెస్‌ ఉంటే త్వరగా బ్యాటరీ ఖర్చవుతుంది. కంటికి కూడా మంచిది కాదు. 
  2. డిస్‌ప్లే వెరైటీగా ఉండాలని గ్రాఫిక్స్‌ థీమ్స్‌, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ ఉండేవి సెట్‌ చేయడం వల్ల బ్యాటరీ త్వరగా పాడవుతుంది. అందుకే ఫోన్‌ను డార్క్‌మోడ్‌లో ఉంచి, డార్క్‌ వాల్‌పేపర్స్‌ను ఎంపిక చేసుకోవాలి. 
  3. స్మార్ట్‌ఫోన్‌లో ఉదయాన్నే వందశాతం బ్యాటరీ అని కనిపించగానే కొందరికి ఎక్కడలేని సంతోషం వస్తుంది. అయితే రాత్రంతా ఇలా ఛార్జింగ్‌ చేసి వదిలేస్తే.. బ్యాటరీ కనీసం రెండేళ్లు కూడా రాదు.. ఏడాదికే లైఫ్‌ అమాంతం తగ్గిపోతుంది. మరి కొందరు బయటికెళ్లేప్పుడు బ్యాటరీ ఎనభై శాతం ఉన్నా.. వందశాతం అవ్వాలని అనవసరంగా ఛార్జింగ్‌ చేస్తుంటారు. అలా కాకుండా బ్యాటరీ పదిశాతం చూపించే సమయంలోనే ఛార్జ్‌ చేయడం వల్ల లైఫ్‌ పెరుగుతుంది. అలాగని జీరో అయ్యేదాకా ఉంచడమూ మంచిది కాదు. 
  4. పోయేదేముంది సౌకర్యంగా ఉంటుందని కొందరు వైఫై, బ్లూటూత్‌ ఆన్‌లో ఉంచుకుంటారు. ఇలా ఉంచడం వల్ల బ్యాటరీ సామర్థం త్వరగా పాడైపోతుంది. దీని వల్ల నిరంతరాయంగా సోషల్‌ మీడియా నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. వీటికి చెక్‌ పెట్టాలంటే ఫ్లయిట్‌ మోడ్‌కు మించింది లేదు. 
  5. అవసరం లేని యాప్స్‌ ఎక్కువగా ఉంచడం వల్ల అవి బ్యాక్‌గ్రౌండ్‌లో నిత్యం రన్‌ అవుతుంటాయి. అందుకే సాధ్యమైనంత వరకూ అవసరమైన యాప్స్‌నే ఉంచుకోవాలి. లొకేషన్‌ బటన్‌ను ఆఫ్‌ చేసుకోవాలి.  
  6. యాప్స్‌ అప్‌డేట్‌ను మాన్యువల్‌గా చేసుకోవడం మంచిది. ఆటోమేటిక్‌ అప్‌డేట్‌ పెడితే బ్యాటరీకి సమస్యే. రెండు, మూడు ఇంటర్నెట్‌ డివైజ్‌లకు కనెక్ట్‌ చేసుకోవడం వల్ల బ్యాటరీకి ఇబ్బంది. బ్యాటరీ సేవింగ్‌ మోడ్‌ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేయడం ఉత్తమం.
  7. వేడిగా, అతి చల్లగా ఉండే ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్‌ ఉంచితే.. బ్యాటరీ సామర్థ్యం దెబ్బతినే అవకాశాలెక్కువ. మొత్తానికి ఇలా స్మార్ట్‌ టిప్స్‌ పాటిస్తేనే స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీకి లైఫ్‌ ఎక్కువగా ఉంటుంది.

Updated Date - 2021-09-15T05:31:05+05:30 IST