పేల సమస్య పోతుందిలా..!

ABN , First Publish Date - 2020-11-23T05:43:27+05:30 IST

బేబీ ఆయిల్‌ను తలకు పట్టించి పేన్ల దువ్వెనతో దువ్వుకోవాలి. కాసేపయ్యాక తలస్నానం చేయాలి. తరువాత వైట్‌ వెనిగర్‌ను జుట్టుకు పట్టించి షవర్‌ క్యాప్‌ని పెట్టి రాత్రంతా అలా ఉంచేయాలి...

పేల సమస్య పోతుందిలా..!

  1. బేబీ ఆయిల్‌ను తలకు పట్టించి పేన్ల దువ్వెనతో దువ్వుకోవాలి. కాసేపయ్యాక తలస్నానం చేయాలి. తరువాత వైట్‌ వెనిగర్‌ను జుట్టుకు పట్టించి షవర్‌ క్యాప్‌ని పెట్టి రాత్రంతా అలా ఉంచేయాలి. వారంలో మూడు నాలుగు రోజులు ఇలా చేస్తే చాలా వరకు పేల సమస్య తగ్గిపోతుంది. 
  2. ఉప్పు, వెనిగర్‌ను సమాన నిష్పత్తిలో తీసుకుని మిశ్రమం మాదిరిగా చేసుకుని జుట్టుకు పట్టించాలి. షవర్‌ క్యాప్‌ పెట్టుకుని రెండు, మూడు గంటల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. మూడు రోజులకొకసారి ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
  3. రాత్రి పడుకునే ముందు పెట్రోలియం జెల్లీని తలకు పట్టించాలి. షవర్‌ క్యాప్‌ లేక టవల్‌తో తలకు కప్పుకుని పడుకోవాలి. ఉదయాన్నే బేబీ ఆయిల్‌ పెట్టి దువ్వుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా వరకు సమస్య పరిష్కారమవుతుంది.
  4. టీ ట్రీ ఆయిల్‌ను హోమియో చికిత్సలో వాడతారు. ఇది న్యాచురల్‌ ఇన్‌సెక్టిసైడ్‌గా పనిచేస్తుంది. ఒక స్పూన్‌ టీ ట్రీ ఆయిల్‌, ఒక షాంపూ, మూడు స్పూన్ల కొబ్బరినూనెను కలిపి తలకు పట్టించాలి. గంటపాటు అలా వదిలేసి వేడి నీళ్లతో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా పేల సమస్య దూరమవుతుంది.

Updated Date - 2020-11-23T05:43:27+05:30 IST