వాట్సప్‌లో డిలీట్‌ అయిన డేటా మళ్లీ చూడొచ్చు!

ABN , First Publish Date - 2020-06-27T05:30:00+05:30 IST

వాట్స‌ప్‌లో మెసేజ్‌లు పెరిగిపోతున్నాయని డిలీట్‌ చేస్తుంటాం. కొన్నిసార్లు అలా డిలీట్‌ చేసిన వాటిలో ముఖ్యమైనవీ ఉంటాయి. వాటిని తిరిగిపొందే అవకాశం ఉంటే బాగుండని అనుకుంటాం. అయితే వాట్సప్‌లో అలా డిలీట్‌ చేసిన మెసేజ్‌లను తిరిగి చూసే...

వాట్సప్‌లో డిలీట్‌ అయిన డేటా మళ్లీ చూడొచ్చు!

వాట్స‌ప్‌లో మెసేజ్‌లు పెరిగిపోతున్నాయని డిలీట్‌ చేస్తుంటాం. కొన్నిసార్లు అలా డిలీట్‌ చేసిన వాటిలో ముఖ్యమైనవీ ఉంటాయి. వాటిని తిరిగిపొందే అవకాశం ఉంటే బాగుండని అనుకుంటాం. అయితే వాట్సప్‌లో అలా డిలీట్‌ చేసిన మెసేజ్‌లను తిరిగి చూసే వీలుంది. అది టెక్ట్స్‌, వీడియో, ఫొటో ఏదైనా సరే. అదెలా అంటే... 


  1. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి వాట్స్‌పరిమూవ్డ్‌ + యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.
  2. యాప్‌ అడిగిన పర్మిషన్లు ఇస్తూ సెటప్‌ పూర్తి చేసి, యాప్‌ ఓపెన్‌ చేయాలి.
  3. ఇప్పుడు ఏ యాప్‌ను సెలక్ట్‌ చేయాలో అడుగుతుంది. వాట్సప్‌ యాప్‌ను ఎంపిక చేసి నెక్ట్స్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
  4. స్ర్కీన్‌పై ‘యస్‌, సేవ్‌ ఫైల్స్‌’ని సెలక్ట్‌ చేసి ‘అలో’పై క్లిక్‌ చేయాలి.
  5. అంతే... గతంలో వాట్స్‌పలో మీకు వచ్చిన మెసేజ్‌లన్నీ వాట్స్‌పరిమూవ్డ్‌ + యాప్‌లో కనిపిస్తాయి. మీరు డిలీట్‌ చేసిన మెసేజ్‌లను కూడా చూడొచ్చు.

Updated Date - 2020-06-27T05:30:00+05:30 IST