ధాన్యం ఆరబోసేదెలా ?

ABN , First Publish Date - 2020-09-29T07:07:15+05:30 IST

వర్షకాలం వరికోతలు మొ దలయ్యాయి. ఓ వైపు వరికోతలు, మరోవైపు సోయా కోతలు, ఇంకోవైపు మినుము పెసర కోతలు ఇలా ఎ

ధాన్యం ఆరబోసేదెలా ?

జిల్లాలో రైతు కల్లాలు మంజూరైనా ఇంకా పూర్తికాని వైనం చేతికొస్తున్న వరి, సోయా, ఇతర పంటలు పంటల ఆరబోతపై అన్నదాతల్లో అయోమయం


బోధన్‌, సెప్టెంబరు 28: వర్షకాలం వరికోతలు మొ దలయ్యాయి. ఓ వైపు వరికోతలు, మరోవైపు సోయా కోతలు, ఇంకోవైపు మినుము పెసర కోతలు ఇలా ఎ టుచూసినా చేతికొచ్చిన పంటల కోతల పర్వం కొన సాగుతోంది. ప్రతియేటా రైతులు ధాన్యంతోపాటు ఇ తర వ్యవసాయ ఉత్పత్తులను ప్రధాన రహదారుల పొడవునా.. గ్రామీణ ప్రాంతాల రోడ్లపైన ఆరబోసేవా రు. ఇప్పుడు ధాన్యం ఆరబోతకు ఇక్కట్లు మొదల య్యాయి. గతంలో ధాన్యం ఆరబోత, వ్యవసాయ ఉ త్పత్తుల ఆరబోత ఎక్కడ చేసిన ఏలాంటి అభ్యం తరాలు ఉండేవి కావు. కానీ రెండు, మూడుయేళ్లుగా ప్రధాన రహదారుల పొడవునా హరితహరం మొక్క లు నాటే కార్యక్రమం చేపట్టి ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. హరితహరం మొక్కలకు ఆటంకాలు కల్పిస్తే పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితితులలో ధాన్యం రాశుల ఆరబోత వ్యవహరం ఇబ్బందికరంగా మారింది.


ప్రతియేటా ఖరీఫ్‌, రబీ సమయంలో రోడ్లకు ఇరువైపులా కిలో మీ టర్ల మేర ధాన్యం రాశుల ఆరబోత కనిపించేది. ఇప్పు డు హరితహారం మొక్కల వల్ల రోడ్లకు ఇరువైపులా ధాన్యం ఆరబోతలు కష్టతరమే!. మరోవైపు ధాన్యం ఆరబోతల కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందు లు లేకుండా రైతు కల్లాలను నిర్మించుకోవాలని పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతు కల్లాల నిర్మాణానికి ప్రభుత్వమే నిధులిచ్చేలా ఏర్పాట్లు చేసింది. రైతులు తమ పంట పొలాల్లో రైతు కల్లాలను నిర్మించుకొని తాము పం డించిన పంటలను అక్కడే ఆరబోసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రోడ్లకు ఇరువైపులా ధాన్యం ఆరబోతల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రా ణాలు సైతం కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. రో డ్లకు ఇరువైపుల ధాన్యం ఆరబోతలను నిలువరిం చేందుకే రైతుకల్లాల నిర్మాణం కాగా వాటి నిర్మాణం నత్తనడక సాగుతున్నాయి. అక్కడక్కడా అరకొరగా పనులు ప్రారంభించి రైతు కల్లాలను నిలిపివేశారు. 


రైతు కల్లాల నిర్మాణం ఎక్కడ?

జిల్లాలో ఒక్కో మండలంలో రైతు కల్లాల నిర్మాణా నికి అధికారులు ఆశావహులైన రైతుల నుంచి ధర ఖాస్తులను స్వీకరించారు. రైతు కల్లాల నిర్మాణానికి ధరఖాస్తులు వందల సంఖ్యలో వచ్చాయి. ఒక్కో మం డలంలో వేల సంఖ్యలో ధరఖాస్తులు వచ్చిపడ్డాయి. అధికారులు ఒక్కో మండలంలో రెండు వందల నుం చి మూడు వందలపైనే రైతు కల్లాల నిర్మాణాలకు అ నుమతులిచ్చారు. రైతు కల్లాల నిర్మాణాలను ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేశారు. ఒక్కో రైతు 65 ఎస్‌ఎఫ్‌టీలు, 75 ఎస్‌ఎఫ్‌టీలు, 80 ఎస్‌ఎఫ్‌టీలలో రైతు కల్లా లు నిర్మించుకునేలా అనుమతులి చ్చారు. రైతు కల్లాల నిర్మాణాల పనులను ఎంపీడీవోలు పర్యవేక్షించేలా ఆదేశాలు ఇచ్చారు. రైతు కల్లాల మంజూరు, నిర్మాణాల బాధ్యత ఎంపీడీ వోలదే కాగా రైతు కల్లాల నిర్మాణం ఎక్కడా ముందు కు సాగలేదు. రైతు కల్లాల నిర్మాణానికి రైతులు ఎగ బడి ముందుకు వచ్చిన నిర్మాణాలు మాత్రం అదే వే గంగా సాగడం లేదు. పంట చేతికొచ్చిన రైతు కల్లాల నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు.


కోతకు వస్తోన్న పంటలు

ఖరీప్‌లో వేసిన పంట చేతికి వస్తుండడంతో ఈ ధాన్యం రాశులను ఎక్కడ ఆరబోయాలన్నది ప్రస్తు తం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది వర్షకా లం రైతులు పెద్దఎత్తున నిజామాబాద్‌, కామారెడ్డి జి ల్లాల్లో పంటలు సాగు చేశారు. అన్ని మండలాల లో ను అటు వరి పంటలు, ఇటు మెట్ట, ఆరుతడి పంట లు పెద్ద ఎత్తున సాగయ్యాయి. ఈ వ్యవసాయ ఉత్ప త్తులను ఎక్కడ ఆరబెట్టాలన్నది ప్రస్తుతం ప్రశ్నార్థ కంగా మారింది. వరి కోతలు మొదలుకావడంతో రై తులు పంట పొలాల నుంచి తెచ్చిన ధాన్యాన్ని ఎక్క డ ఆరబోయాలన్నది ప్రశ్నలకు తావిస్తుంది. రైతు క ల్లాలు పూర్తికాకపోవడం రోడ్లకు ఇరువైపులా ధాన్యం ఆరబోసే పరిస్థితి లేకపోవడం రైతులను అయో మయానికి గురి చేస్తుంది.


రోడ్లకు ఇరువైపులా ఆరబోస్తే..

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలోని వివి ధ మండలాలలో చేతికొచ్చిన ధాన్యం రాశులను రైతు లు ఎక్కడ ఆరబోయాలన్నది ప్రస్తుతం చర్చనీయాం శంగా మారింది. ఉమ్మడి జిల్లాల పరిధిలో వ్యవసా య ఉత్పత్తులు చేతికివచ్చే దశలో ఉండగా ధాన్యం రాశులను ఆరబోయడం రైతులకు ప్రశ్నార్థకంగా మా రింది. రోడ్లకు ఇరువైపుల నాటిన హరితహరం మొ క్కలను కాపాడేందుకు ట్రీ గార్డులను ఏర్పాటు చేయ డం, వన సంరక్షకులను ఏర్పాటు చేయడం ట్యాంక ర్‌ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మొక్కలు ధాన్యం ఆరబోతతో నాశనం అయ్యే ప్రమాదం ఉంది. హరితహారం మొక్కలను కాపాడాలంటే ధాన్యం ఆర బోతలను రోడ్లకు ఇరువైపులా అడ్డుకోవాలి. మరోవైపు ధాన్యాన్ని రైతులు ఎక్కడ ఆరబెట్టుకోవాలన్నది కూ డా అధికారులే చెప్పాల్పి ఉంది. మొక్కలను కాపాడ డం, ధాన్యం ఆరబోతలకు ప్రత్యామ్నాయం చూపడం అధికారుల బాధ్యతే! రైతు కల్లాలను పూర్తి చేయిం చడంలో నిర్లక్ష్యం చూపిన అధికారులు కనీసం రైతు లకు టార్ఫాలిన్‌లో సైతం సరఫరా చేయలేదు. రైతు కల్లాలు లేక టార్ఫాలిన్‌ లేక రోడ్లకు ఇరువైపులా ధా న్యం ఆరబోసుకునే పరిస్థితులు లేక రైతులు ధాన్యం ఆరబోతలపై ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-09-29T07:07:15+05:30 IST