బొమ్మగీస్తారా?

ABN , First Publish Date - 2020-04-27T06:12:10+05:30 IST

ఏనుగు బొమ్మ గీయడం చాలా సులభం. ఎలా అంటారా? ఇదిగో ఇలా...

బొమ్మగీస్తారా?

ఏనుగమ్మ ఏనుగు!


ఏనుగు బొమ్మ గీయడం చాలా సులభం. ఎలా అంటారా? ఇదిగో ఇలా...

1. ఏనుగు తల ముందు భాగం గీయడంతో బొమ్మను ప్రారంభించాలి.

2. దంతాలు గీయాలి.

3. ఏనుగు వీపు భాగం, మెడ కింది భాగం వచ్చేలా అవుట్‌లైన్‌ గీయాలి.

4. రెండు కాళ్లు గీయాలి. ఏనుగు తొడ భాగం కోసం బొమ్మలో చూపించిన విధంగా గీత గీయాలి.

5. తోక, పొట్ట కింది భాగం, తొండం గీయాలి.

6. కాళ్ల కింది భాగంలో చిన్న గీత గీసి కలిపితే పాదాలు రెడీ. 

7. ఇప్పుడు మిగిలిన రెండు కాళ్లు గీయాలి.

8. చెవి, కన్ను గీయాలి. కాళ్లకు పాదాలు గీయాలి.

9. తరువాత రంగులు వేస్తే ఏనుగు బొమ్మ రెడీ.

Updated Date - 2020-04-27T06:12:10+05:30 IST