బొమ్మగీయండి!

ABN , First Publish Date - 2020-04-23T05:30:00+05:30 IST

ఒక కాగితాన్ని తీసుకుని నాలుగు సమాన భాగాలు అయ్యేలా మడవండి. తరువాత పెన్సిల్‌తో గీతలు గీయండి...

బొమ్మగీయండి!

  •                     కోడిపిల్ల!


1. ఒక కాగితాన్ని తీసుకుని నాలుగు సమాన భాగాలు అయ్యేలా మడవండి. తరువాత పెన్సిల్‌తో గీతలు గీయండి.

2. మధ్య గీత పైభాగంలో బొమ్మలో చూపిన విధంగా ఒక వృత్తాన్ని గీయండి.

3. శరీర భాగం కోసం ఆంగ్ల అక్షరం ‘యు’ గీసి వృత్తానికి కలపండి. దాని కిందే ఇంకాస్త పెద్ద సైజులో మరోసారి ‘యు’ గీసి కలపండి.

4. బొమ్మలో చూపించిన విఽధంగా మెడ భాగంలో గీతను చెరిపేయండి. 

5. కళ్లు, ముక్కు గీయండి.

6. కళ్లలో వృత్తాన్ని గీయండి. 

7. రెక్కలు గీయండి.

8. కాళ్లు గీయండి. 

9. సూర్యుడు, అక్కడక్కడా గడ్డి గీయండి.

10. చివరగా రంగులు వేయండి. అంతే... కోడిపిల్ల బొమ్మ రెడీ.

Updated Date - 2020-04-23T05:30:00+05:30 IST