పంచాయతీ నిధులు ఫ్రీజింగ్‌లో పెడితే పనులు ఎలా చేయాలి

ABN , First Publish Date - 2021-10-20T06:47:35+05:30 IST

సర్పంచ్‌లుగా పదవి చేపట్టి తొమ్మిది నెలలు కావస్తున్నా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాన పోలేదని పెదలబుడు మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ పెట్టెలి దాసుబాబు, మాదల సర్పంచ్‌ వంతల శ్రీనివాసరావు వాపోయారు.

పంచాయతీ నిధులు ఫ్రీజింగ్‌లో పెడితే పనులు ఎలా చేయాలి
విలేకర్లతో మాట్లాడుతున్న సర్పంచ్‌లు దాసుబాబు,శ్రీనివాసరావు




 పెదలబుడు, మాదల సర్పంచ్‌లు 

అరకులోయ,అక్టోబరు19: సర్పంచ్‌లుగా పదవి చేపట్టి తొమ్మిది నెలలు కావస్తున్నా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాన పోలేదని పెదలబుడు మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ పెట్టెలి దాసుబాబు, మాదల సర్పంచ్‌ వంతల శ్రీనివాసరావు వాపోయారు. మంగళవారం పెదలబుడు పంచాయతీ కార్యాలయంలో వారు విలేకర్లతో  మాట్లాడుతూ.. ప్రభుత్వం సర్పంచ్‌ లను ఉత్సవ విగ్రహాల్లా చేసిందని విమర్శించారు. పంచాయతీల అభివృద్ధికి మంజూరైన నిధులను ఖర్చు పెట్టనియ్యకుండా ఫ్రీజింగ్‌ పెట్టడంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమై నిధులపై ఫ్రీజింగ్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. జనరల్‌ ఫండ్‌ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులపై ఫ్రీజింగ్‌ విఽధించారన్నారు. గ్రామాల్లో ఏ నిధులతో పనులు చేపట్టాలని, ప్రజలకు ఏమని సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదే విధానం కొనసాగితే తామంతా పంచాయతీ ప్రజలతో కలిసి రోడ్డు ఎక్కి ఆందోళన చేయాల్సి వస్తుందన్నారు.

Updated Date - 2021-10-20T06:47:35+05:30 IST