Abn logo
Mar 8 2021 @ 00:34AM

బ్రిస్క్‌ వాక్‌ చేస్తున్నారా..?

  1. బ్రిస్క్‌ వాకింగ్‌ చేసేటప్పుడు ఎలా నడుస్తున్నారన్నది చాలా ముఖ్యం. ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌’ (సిడిసి) నిబంధన ప్రకారం నిమిషానికి 100 అడుగులు ఉండేలా బ్రిస్క్‌ వాక్‌ చేయాలి. దీని కన్నా ఎక్కువ అడుగులతో బ్రిస్క్‌ వాక్‌ చేస్తే తప్పుగా బ్రిస్క్‌ వాకింగ్‌ చేస్తున్నారని గమనించుకోవాలి.
  2. నడిచేటప్పుడు చేతులను ఎక్కువగా ఊపుతూ నడుస్తుంటారు. అలా చేస్తే బ్రిస్క్‌ వాకింగ్‌ సరిగా చేయడం లేదని అర్థం. చేతులను ఎక్కువగా ఊపడం వల్ల నడక వేగం ఏమీ పెరగదు. అందుకే మీ శరీరం సెంటర్‌ లైన్‌ని చేతుల కదలికలు దాటకుండా చూసుకోవాలి. బ్రిస్క్‌ వాకింగ్‌ చేసేటప్పుడు మోచేతులను 90 డి గ్రీల  పొజిషన్‌లో ఉంచాలి. చేతులను బిగదీసినట్టు ఉంచకుండా రిలాక్సింగ్‌గా ఉంచాలి.
  3. బ్రిస్క్‌ వాకింగ్‌ చేసేటప్పుడు నడుమును అటు ఇటు తిప్పుతుంటారు. ఫాస్ట్‌ రన్నింగ్‌ చేసేటప్పుడు అలా సహజంగా జరుగుతుంది కానీ బ్రిస్క్‌ వాకింగ్‌ చేసేటప్పుడు మాత్రం అలా నడుమును ఇష్టమొచ్చినట్టు అటు ఇటు ట్విస్టు చేయకూడదు. 
  4. బ్రిస్క్‌ వాకింగ్‌ చేసేటప్పుడు తల వంచుకుని నడిస్తే భుజాలపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల మెడ, నడుము, వీపు, భుజాలపై టెన్షన్‌ తలెత్తుతుంది. అందుకే భుజాలు రిలాక్సింగ్‌గా ఉంచుకోవాలి. భుజాలను వదులుగా వదిలేయడం వల్ల హాయిగా నడవగలరు. 
  5. బ్రిస్క్‌ వాకింగ్‌ చేసేటప్పుడు వెన్నుముకను నిటారుగా ఉంచామా లేదా అన్న దానిపై దృష్టిపెట్టాలి. వీపు గూనిగా పెట్టి ముందుకు వంగుతూ నడవొద్దు. 
  6. బ్రిస్క్‌ వాక్‌లో కాళ్ల కదలికలు కూడా ముఖ్యమే. బొటనవేళ్లు ముందుకుపడేలా అడుగులు వేయాలి. కాలు పైకి ఎత్తి ముందుకు  వేస్తూ హిప్‌ భాగం వద్ద తొడలు ఫ్లెక్సిబుల్‌గా పెట్టుకోవాలి.
  7. ఏటవాలు ప్రాంతంలో బ్రిస్క్‌ వాక్‌ చేసేటప్పుడు పాదాలను బ్యాలెన్స్‌ చేసుకోవాలి. వీపు భాగం నిటారుగా ఉంచాలి. చిన్న చిన్న అడుగులు వేస్తూ నడక వేగం తగ్గించాలి. మోకాళ్లను కొద్దిగా ముందుకు వంచాలి. ఇలా చేయడం వల్ల కీళ్లపై తక్కువ ప్రభావం పడుతుంది. బ్రిస్క్‌ వాకింగ్‌ చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుపెట్టుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.

Advertisement
Advertisement
Advertisement