Advertisement
Advertisement
Abn logo
Advertisement

గుండె దడ తగ్గాలంటే...?

ఆంధ్రజ్యోతి(30-04-2021)

ప్రశ్న: మా నాన్నగారికి గత కొంత కాలంగా గుండె దడతో పాటు బీపీ కూడా ఉంది, ఈ మధ్య నీరసంగా ఉంటున్నారు. సరైన ఆహారం ద్వారా గుండె దడను తగ్గించవచ్చా?


- నాగపుష్ప, సికింద్రాబాద్‌


డాక్టర్ సమాధానం: దడ ఉన్న అన్ని సందర్భాల్లోనూ గుండెకు ఏదో సమస్య ఉందని కాదు. మానసిక, శారీరక ఒత్తిళ్లు, అనారోగ్యం, డీహైడ్రేషన్‌, అకస్మాత్తుగా లేవడం, నిలబడడం, కిందకు వంగడం, గుండెకు శ్రమను పెంచే వాటన్నిటి వల్ల కొన్నిసార్లు గుండె దడ రావచ్చు. ఒత్తిడిని నియంత్రించే మార్గాల ద్వారా కొంత వరకు గుండె దడను అదుపులో ఉంచవచ్చు. కేవలం దడగా అనిపించినప్పుడు మాత్రమే కాకుండా రోజంతా ప్రశాంతంగా ఉండేందుకు మార్గాలు ఎంచుకోవాలి. డీహైడ్రేషన్‌ ఉండకుండా చూసుకోవాలి. తప్పనిసరిగా రెండు నుంచి మూడు లీటర్ల నీటిని రోజూ తాగాలి. వేసవికాలంలో చెమట ద్వారా నీరు, ఖనిజ లవణాలను ఎక్కువగా కోల్పోతాం. కొబ్బరి బొండం నీళ్లు, ఉప్పు, చక్కెర వేయని నిమ్మకాయ నీళ్లు, పుచ్చ, కర్బుజా లాంటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. గుండె వేగాన్ని పెంచే కాఫీలు, టీలు, కూల్‌ డ్రింకులకు దూరంగా ఉండాలి. వయసుకు, ఎత్తుకు తగ్గ బరువును కలిగి ఉండేందుకు ప్రయత్నించాలి. రోజూ అరగంట పాటైనా తేలిక పాటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయడం మంచిది. దీనివల్ల గుండె కండరాలు బలపడి దడ నియంత్రణలోకి వస్తుంది. ఇన్ని పాటించినా గుండె దడ తగ్గకపోతే హృద్రోగ నిపుణులను సంప్రదించాలి.


డా. లహరి సూరపనేని 

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...