పైబడే వయసు వేగం తగ్గాలంటే...

ABN , First Publish Date - 2021-09-14T05:30:00+05:30 IST

చర్మం మీద ముడతలు ఏర్పడడం, చర్మం సాగిపోవడం వయసు పైబడడానికి సంకేతాలే కాదు, ఒత్తిడి, ఇన్‌ఫ్లమేషన్‌, పోషకాహార లోపాలకు కూడా సూచనలే! పైబడే వయసు వేగానికి బ్రేక్‌లు వేయాలంటే...

పైబడే వయసు వేగం తగ్గాలంటే...

చర్మం మీద ముడతలు ఏర్పడడం, చర్మం సాగిపోవడం వయసు పైబడడానికి సంకేతాలే కాదు, ఒత్తిడి, ఇన్‌ఫ్లమేషన్‌, పోషకాహార లోపాలకు కూడా సూచనలే! పైబడే వయసు వేగానికి బ్రేక్‌లు వేయాలంటే...

  1. చర్మానికి బిగువును అందించే కొల్లాజెన్‌ సప్లై చక్కెరతో కుంటుపడుతుంది. కాబట్టి తీపి మానేయాలి.
  2. డీహైడ్రేషన్‌తో చర్మం ముడతలు పడుతుంది. కాబట్టి రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగుతూ ఉండాలి.
  3. ఒత్తిడితో పెరిగే కార్టిసాల్‌ హార్మోన్‌ చర్మపు ఆరోగ్యానికి తోడ్పడే ఖనిజ లవణాలను హరిస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవాలి.
  4. ప్రతి రోజూ వివిధ రూపాల్లో దాడి చేసే టాక్సిన్ల వల్ల ఫ్రీ ర్యాడికల్స్‌ డ్యామేజీ జరుగుతూ ఉంటుంది. ఫలితంగా వయసు కంటే ముందే వృద్ధాప్య లక్షణాలు చోటు చేసుకుంటాయి. వీటికి విరుగుడుగా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి.
  5. కణజాల నిర్మాణానికీ, మరమ్మతుకూ ప్రొటీన్‌ అవసరం. ప్రొటీన్‌ లోపం చర్మపు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. కాబట్టి సరిపడా మాంసకృతులు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

Updated Date - 2021-09-14T05:30:00+05:30 IST