జుట్టు రాలకుండా ఉండాలంటే..

ABN , First Publish Date - 2020-08-19T19:09:17+05:30 IST

నాకు ముప్ఫై ఏళ్లు. జుట్టు రాలడం ఎక్కువైంది. ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకుంటే మంచిది?

జుట్టు రాలకుండా ఉండాలంటే..

ఆంధ్రజ్యోతి( 19-08-2020)

ప్రశ్న: నాకు ముప్ఫై ఏళ్లు. జుట్టు రాలడం ఎక్కువైంది. ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకుంటే మంచిది?


- రామలక్ష్మి, విజయనగరం 


డాక్టర్ సమాధానం: కేశాల ఆరోగ్యానికి ప్రొటీన్లు ఎంతో అవసరం. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే చికెన్‌, చేప, గుడ్లు లాంటి మాంసాహారంతో పాటు పాలు, పెరుగు, పప్పు ధాన్యాలు బాగా తీసుకుంటే మంచిది. వీటిని రోజులో ఓసారి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంకా శరీరానికి అవసరమైన ఐరన్‌, జింక్‌, సెలీనియం మొదలైన ఖనిజాలు ఉన్న ఆహారాన్నీ తీసుకోవాలి. మాంసాహారంతో పాటు కందులు, పెసలు, మిముములు లాంటి పప్పు ధాన్యాలు, బాదం, పిస్తా, వాల్నట్స్‌, అవిసె గింజలు కూడా మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. వీటివల్ల జుట్టుకు అవసరమైన ఒమేగా 3 ఫాటీ యాసిడ్లు కొంత వరకు లభిస్తాయి. విటమిన్‌ - డి తక్కువగా ఉన్నా జుట్టు రాలుతుంది. ఒకవేళ విటమిన్‌ - డి చాలా తక్కువగా ఉంటే వైద్యుల సలహా మేర సప్లిమెంట్స్‌ వాడవచ్చు. రోజూ ఇరవై నిమిషాల పాటు ఎండలో గడపడం అలవరచుకోవాలి. నిద్రలేమి కూడా ఈ సమస్యకు కారణం. నిద్ర వేళకి రెండు గంటల ముందు ఆహారం తీసుకోవడం, గంట ముందు ఫోను, టీవీ తదితర ఎలకా్ట్రనిక్‌ పరికరాలను ఆపివేయడం మంచిది. నిద్రపోయేముందు మెడిటేషన్‌ చేయడం లేదా ఏదైనా పుస్తకం చదవడం అలవరచుకోవాలి. రోజూ కనీసం ఏడు గంటలైనా నిద్ర పోవాలి. ఆందోళన లేని జీవితం మీ సమస్యను కొంతవరకు పరిష్కరిస్తుంది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-08-19T19:09:17+05:30 IST