కోటి మంది పిల్లలు ప్రధాని మోదీకి వినతులు పంపారు... మీరు కూడా ఈ 6 మార్గాల్లో మీ సమస్యలు చెప్పుకోవచ్చు!

ABN , First Publish Date - 2022-01-31T14:41:44+05:30 IST

భారతదేశ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)ను..

కోటి మంది పిల్లలు ప్రధాని మోదీకి వినతులు పంపారు... మీరు కూడా ఈ 6 మార్గాల్లో మీ సమస్యలు చెప్పుకోవచ్చు!

భారతదేశ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)ను ఎలా సంప్రదించాలి? ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సందేశం పంపాలనుకుంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.  ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. దేశ, విదేశాల నుంచి కోటి మందికిపైగా చిన్నారులు తమ ‘మన్‌కీ బాత్‌’లో తనకు పలు సందేశాలు పంపారని, వాటిని చదవడానికి తాను ప్రయత్నించానన్నారు. పిల్లలు వారి వినతులలో పరిసరాల పరిశుభ్రత, ఉగ్రవాదం నుంచి విముక్తి, అక్షరాస్యతతో సహా పలు అంశాలను ప్రస్తావించారని పేర్కొన్నారు. మీరు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మీ వినతి పంపాలనుకుంటే ఈ ఆరు మార్గాలలో దేనినైనా ఆశ్రయించవచ్చు.


1 నమో యాప్ 

మీరు ప్రధానమంత్రి అధికారిక నమో యాప్ సాయంతో కూడా మీ వినతిని ప్రధాని మోదీకి తెలియజేయవచ్చు. దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

2 పీఎంఓ వెబ్‌సైట్

మీరు మీ అభిప్రాయాన్ని లేదా సందేశాన్ని ప్రధానమంత్రికి తెలియజేయాలనుకుంటే.. నేరుగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ప్రధాన మంత్రి కార్యాలయ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మీ వినతిని ప్రధాని మోదీకి తెలియజేయవచ్చు. 

3 సోషల్ మీడియా

వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల సాయంతో కూడా మీ మన్ కీ బాత్‌ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలియజేయవచ్చు. ఇందుకోసం ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్‌లను ఆశ్రయించవచ్చు.


4 యూ ట్యూబ్ ఛానల్

మీరు ప్రధాని మోడీ అధికారిక యూ ట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీ సందేశాన్ని పంపవచ్చు. ఇందుకోసం యూట్యూబ్‌లోకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ ఛానల్ సెర్చ్ చేయండి. అనంతరం దానిలోని వీడియోల కింద సందేశాన్ని పంపే అవకాశం ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీ వినతిని మోదీకి తెలియజేయవచ్చు.

5 చిరునామా, ఫ్యాక్స్ 

మీరు ప్రధాని మోదీకి ఫ్యాక్స్ చేయాలనుకుంటే, ఈ నంబర్( +91-11-23019545, 23016857)కు సంప్రదించవచ్చు. అలాగే మీరు పోస్ట్ కార్డ్ ద్వారా కూడా మీ మనసులోని మాటను ప్రధాని మోదీకి తెలియజేయవచ్చు. మీ లేఖను పీఎంఓ వెబ్‌సైట్‌లో సూచించిన చిరునామాకు పంపవచ్చు. 

6 ఈ మెయిల్

మీరు ఈ-మెయిల్ సాయంతో కూడా ప్రధాని మోదీని సంప్రదించవచ్చు. ఇందుకోసం మీరు connect@mygov.nic.inకు మెయిల్ చేయవచ్చు. ప్రధానమంత్రి కార్యాలయం ఈ.. ఈ- మెయిల్ చిరునామాను జారీ చేసింది. దీని సాయంతో సామాన్య ప్రజలు తమ వినతులను ప్రధానమంత్రికి పంపుకోవచ్చు. 


Updated Date - 2022-01-31T14:41:44+05:30 IST