Abn logo
Mar 3 2021 @ 20:18PM

విద్యార్థుల ప్రతీకారమే కథాంశంగా వస్తోన్న చిత్రమిదే

కోలీవుడ్‌: ఊరి ప్రజల మధ్య తమ చేత గుంజీళ్ళు తీయించి అవమానపరచిన దాదాపై విద్యార్థులు ప్రతీకారం తీసుకునే కథాంశంతో రూపుదిద్దుకున్న చిత్రం ‘తోప్పుకరణం’. భాస్కర్‌ శ్రీనివాసన్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోహన్‌, అక్షయ్‌, చంద్రు, రిషికేశ్వరన్‌, నిరంజన్‌లు కాలేజీ విద్యార్థులుగా నటించారు. దర్షిణి దర్శకులుగా పరిచయమవుతున్నారు. గత 2017 సంవత్సరం నుంచి 2019 వరకు వరుసగా ‘మిస్టర్‌ ఇండియా’గా హవా చాటిని స్టీవ్‌ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటు చిత్ర నిర్మాత భాస్కర్‌  శ్రీనివాసన్‌ ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. కథ, స్ర్కీన్‌ప్లే, సంభాషణలను కెన్నడిప్రియన్‌ సమకూర్చారు. వంద రోజుల్లో వంద పాటలకు సంగీతం సమకూర్చి రికార్డు సృష్టించిన శ్రవణ్‌ ఈ చిత్రానికి సంగీత బాణీలను సమకూర్చుతున్నారు. 


ఈ చిత్ర కథ గురించి నిర్మాత భాస్కర్‌ శ్రీనివాసన్‌ మాట్లాడుతూ.. తమను అవమానానికి గురిచేసిన దాదా మీద ఐదుగురు విద్యార్థులు ఎలా ప్రతీకారం తీర్చుకున్నారన్నదే  చిత్ర కథ అని వివరించారు. తిరుచ్చి, మధురై, కోయంబత్తూరు, పాండిచ్చేరి తదితర ప్రాంతాల నుంచి విద్యార్థులను ఎంపిక చేసి, వారితోనే నటింపజేసినట్టు  తెలిపారు. చెన్నై, విల్లుపురం ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగును జరిపినట్టు నిర్మాత వెల్లడించారు. 

Advertisement
Advertisement
Advertisement