Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 23 Jun 2022 16:05:20 IST

‘థోర్’ ప్రాంచైజీలో Natalie Portman ఆరడుగులతో కనిపించడానికి సరికొత్త టెక్నిక్

twitter-iconwatsapp-iconfb-icon

‘బ్లాక్ స్వాన్’ (Black Swan), ‘థోర్’(Thor), ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’(Avengers: Endgame)వంటి సినిమాల్లో కనిపించి ప్రేక్షకులకు చేరువైన నటి నటాలీ ఫోర్ట్‌మన్ (Natalie Portman). తాజాగా ‘థోర్: లవ్ అండ్ థండర్’  (Thor: Love And Thunder)చిత్రంలో నటించారు. ఈ మూవీ జులై 8న విడుదల కానుంది. ఈ సినిమాలో నటాలీ ఆరడుగులతో కనిపించాల్సి వచ్చింది. కానీ, ఆమె మాత్రం 5అడుగుల 3అంగుళాలు మాత్రమే ఉంటారు. ఈ మూవీలో ఆరడుగులు ఉన్న పాత్ర పోషించడానికి బరువు పెరిగానని ఆమె చెప్పారు. చిత్ర బృందం ఓ కొత్త టెక్నిక్‌ను కనిపెట్టిందని పేర్కొన్నారు. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే 10నెలలు శిక్షణ తీసుకున్నానని వెల్లడించారు.     


‘థోర్: లవ్ అండ్ థండర్’ సినిమాలో సహనటులతో కలసి నడిచే కొన్ని సీన్స్ ఉన్నాయి. అందులో భాగంగా ఆరడుగుల పొడుగుతో కనిపించాలి. ప్రస్తుతం పొడవు పెరగడం అసాధ్యం. అందు కోసం దర్శకులు ఓ కొత్త టెక్నిక్‌ను కనిపెట్టారు. నేలకు కొంచెం ఎత్తులో ఓ సరికొత్త మార్గాన్ని నిర్మించారు. ఆ మార్గాన్ని ‘డెక్’ అంటారు. ఆరడుగులతో కనిపించాడనికి ఈ ‘డెక్’ మీదే నటాలీ నడిచారు. చిత్రబృందం అంతా ఈ సీన్స్ అన్నింటిని ముందుగా రిహార్సల్ చేశారు. ఈ సన్నివేశాల్లో క్రిస్ హెమ్సవర్త్ కూడా నటించారు. అందుకోసం ఆయన తీవ్రంగా శ్రమించారని నటాలీ స్పష్టం చేశారు. ‘థోర్: లవ్ అండ్ థండర్’ సినిమాను మార్వెస్ స్టూడియోస్ నిర్మించింది. శాన్ డియోగోలో 2019లో జరిగిన కామికాన్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మార్వెల్ పేర్కొంది. ‘థోర్’ ప్రాంచైజీలో రాబోతున్న నాలుగో సినిమా ఇది. ఆస్కార్ అవార్డు విజేత తైకా వెయిటిటి (Taika Waititi) దర్శకత్వం వహించారు. ఇండియాలో ఈ చిత్రం ఒక రోజు ముందుగానే జులై 7న విడుదల కానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

OtherwoodsLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement