ఎన్నిసార్లు షోకాజ్‌ నోటీసులివ్వాలి

ABN , First Publish Date - 2022-08-13T05:27:41+05:30 IST

మీరు రోగులకు అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి.. ఎన్నిసార్లు షాకాజ్‌ నోటీసులిచ్చినా పని తీరు మార్చుకోవడం లేదంటూ వైద్యాధికారి శివకుమార్‌ పై ఐటీడీఏ పీవో బి. నవ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మెళియాపుట్టి పీహెచ్‌సీ ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఎన్నిసార్లు షోకాజ్‌ నోటీసులివ్వాలి
వైద్యాధికారిపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్న పీవో నవ్య

పనితీరు మార్చుకోరా?

వైద్యాధికారిపై ఐటీడీఏ పీవో ఆగ్రహం 

మెళియాపుట్టి, ఆగస్టు 12: మీరు రోగులకు అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి.. ఎన్నిసార్లు షాకాజ్‌ నోటీసులిచ్చినా పని తీరు మార్చుకోవడం లేదంటూ వైద్యాధికారి శివకుమార్‌ పై ఐటీడీఏ పీవో బి. నవ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మెళియాపుట్టి పీహెచ్‌సీ ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మీరు సరిగా విధులకు హాజరుకావడం లేదని పీవో ప్రశ్నించగా సక్రమంగా విధులకు వస్తున్నానని ఆయన సమాధానమిచ్చారు. దీంతో గతంలో తాను స్వయంగా తనిఖీ చేశానని, ఓపీ సమయంలో మీరు లేరని, అప్పుడు మొదటిసారి షోకాజ్‌ నోటీసులి చ్చామని, అయినా మీలో మార్పు రాలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. మరోసారి పునరావృతం అయితే సస్పెన్షన్‌ చేయాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. 24 గంటలు వైద్యసేవలు అందించాలని సూచించారు. మండల కేంద్రంలో వైద్య సేవలు అందక పోవడం విచారకరమన్నారు. ఆరోగ్య కేంద్రాన్ని పరి శుభ్రంగా ఉంచాల ని, నాడు- నేడు పనులను వేగవంతం చేయాలని కోరారు. అంతకుముందు వసుంధర, కొసమాల సచివాలయాలను తనిఖీ చేశారు. రికార్డులు సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఎంసీపీ కొత్తూరు రహదారి పనులను పరిశీలించారు. ఎంపీడీవో చంద్ర కుమారి ఉన్నారు.

 

Updated Date - 2022-08-13T05:27:41+05:30 IST