దేశంలో ప్రస్తుతం ఎంత మంది విదేశీయులు నివసిస్తున్నారో తెలుసా?... ఏ దేశానికి చెందినవారు ఎక్కువగా ఉన్నారంటే..

ABN , First Publish Date - 2022-03-09T17:45:43+05:30 IST

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పటి..

దేశంలో ప్రస్తుతం ఎంత మంది విదేశీయులు నివసిస్తున్నారో తెలుసా?... ఏ దేశానికి చెందినవారు ఎక్కువగా ఉన్నారంటే..

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పటి నుంచి ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపుపై చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో విదేశాల్లో ఉంటున్న భారతీయుల గురించి పలు గణాంకాలు బయటికి వస్తున్నాయి. అయితే మనదేశంలోనూ పెద్ద సంఖ్యలో విదేశీయులు ఉంటున్నారు. వీరు స్టూడెంట్ లేదా జాబ్ వీసాపై వచ్చి భారతదేశంలో ఉంటున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఎంత మంది విదేశీయులు నివసిస్తున్నారో ఇప్పుడు  తెలుసుకుందాం. లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇచ్చిన డేటా ప్రకారం, భారతదేశంలో 2016లో 72172 మంది, 2017లో 70463 మంది, 2018లో 72268 మంది, 2019లో 74689 మంది, 2020లో 20561 మంది, 2020లో 23419 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు.


వారు స్టూడెంట్ వీసాతో భారత్‌కు వచ్చారు. మంత్రిత్వ శాఖ అందించిన డేటా ప్రకారం, 02 డిసెంబర్ 2021 నాటికి, 20,607 మంది విదేశీయులు ఉపాధి వీసాలపై భారతదేశంలో నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది కొరియా, జపాన్, చైనాకు చెందిన వారున్నారు. వీరిలో కొరియాకు చెందిన 4748 మంది, జపాన్‌కు చెందిన 4038 మంది, చైనాకు చెందిన 1700 మంది పౌరులు ఇక్కడ ఉంటున్నారు. అదే సమయంలో అమెరికాకు చెందిన 1000 మందికి పైగా పౌరులు ఉపాధి వీసాపై భారతదేశంలో ఉంటున్నారు. దీంతో పాటు బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, మలేషియా దేశాలకు చెందిన వారు కూడా ఇక్కడ అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. కాగా జనవరి 01, 2020 నుండి నవంబర్ 30, 2021 మధ్య కాలంలో 41,51,758 మంది విదేశీయులు భారతదేశాన్ని విడిచిపెట్టారు. 

Updated Date - 2022-03-09T17:45:43+05:30 IST