రైళ్లకు పేర్లను ఎలా నిర్ణయిస్తారు? ఆ లెక్కలేమిటో తెలుసా?

ABN , First Publish Date - 2022-05-31T12:50:09+05:30 IST

భారతీయ రైల్వేలో మొత్తం 22,593 రైళ్లు ఉన్నాయి.

రైళ్లకు పేర్లను ఎలా నిర్ణయిస్తారు? ఆ లెక్కలేమిటో తెలుసా?

భారతీయ రైల్వేలో మొత్తం 22,593 రైళ్లు ఉన్నాయి. వీటిలో 9,141 సరుకు రవాణా రైళ్లు కాగా, 13,452 పాసింజర్ రైళ్లు. భారతీయ రైల్వే తన సేవలతో దేశం మొత్తాన్ని కలుపుతుంది. అయితే రైళ్లకు ఏ ప్రాతిపదికన పేర్లు పెడతారనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. భారతీయ రైల్వే.. రైళ్లకు మూడు అంశాల ఆధారంగా పేర్లు పెడుతుంది. 



వర్గం 1: స్థానం ఆధారంగా పేర్లు పెట్టడమనేది మొదటి కేటగిరీకి చెందినది. ఫలానా ప్రదేశం నుంచి ప్రారంభమై ఫలానా ప్రదేశానికి వెళ్లేది. ఉదాహరణకు.. ముంబై ఎక్స్‌ప్రెస్.. హైదరాబాద్ -ముంబై మధ్య నడుస్తుంది

వర్గం II:  నిర్దిష్ట స్థాన ఆధారిత రైళ్లు.. ఇవి నిర్దిష్ట స్థానాలు, జాతీయ ఉద్యానవనాలు, స్మారక చిహ్నాలు లేదా ప్రాంతాల గుండా వెళతాయి. ఉదాహరణకు..ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్.. ఇది హైదరాబాద్ నుండి హౌరా వరకు నడుస్తుంది. 

మూడవ వర్గం: రాజధానిని అనుసంధానించే రైళ్లు.. ఉదాహరణకు రాజధాని ఎక్స్‌ప్రెస్: ఇది దేశ రాజధాని ఢిల్లీని వివిధ రాష్ట్రాల రాజధానులతో కలుపుతుంది. 

డీలక్స్ రైలు వర్గం: గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్.. ఇది డీలక్స్ రైలు వర్గం. ఈ రైలు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే ఆధునిక సౌకర్యాలతో కూడిన రైలు.

Updated Date - 2022-05-31T12:50:09+05:30 IST