ఆపరేషన్ చేసిన మచ్చ పోయేదెలా?

ABN , First Publish Date - 2022-02-04T17:29:09+05:30 IST

నా వయసు పదిహేను సంవత్సరాలు. నా పై పెదవికి గ్రహణం మొర్రి ఆపరేషన్‌ జరిగింది. ఆపరేషన్‌ చేసిన మచ్చ పోయేందుకు ఏదైనా మార్గం ఉంటుందా?

ఆపరేషన్ చేసిన మచ్చ పోయేదెలా?

ఆంధ్రజ్యోతి(04-02-2022)

ప్రశ్న: నా వయసు పదిహేను సంవత్సరాలు. నా పై పెదవికి గ్రహణం మొర్రి ఆపరేషన్‌ జరిగింది. ఆపరేషన్‌ చేసిన మచ్చ పోయేందుకు ఏదైనా మార్గం ఉంటుందా?


- దినకరన్‌, నల్గొండ


డాక్టర్ సమాధానం: గాయాలు, కాలడం, శస్త్రచికిత్స, మొటిమలు పగలడం లాంటి ఏవైనా కారణాల వల్ల చర్మం దెబ్బతిన్నప్పుడు, ఆ చర్మాన్ని సరిచేసే క్రమంలో మచ్చలు ఏర్పడతాయి. కాలక్రమేణా చాలా మచ్చలు సహజంగానే తగ్గిపోతాయి. మచ్చపరిమాణం, శరీరంలో ఏ చోటులో ఉంది, ఎంత కాలంగా ఉంది, వయసు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని కొన్ని రకాల మచ్చలను సరైన చికిత్స ద్వారా కొంత వరకు తగ్గించగలుగుతారు. శరీరంలో విటమిన్‌- సి, డి లోపిస్తే కూడా మచ్చలు తగ్గడం ఆలస్యమవుతుంది. విటమిన్‌- సి కోసం తాజాపండ్లు, సలాడ్ల రూపంలో పచ్చి కూరగాయలు తీసుకోవాలి. విటమిన్‌ - డి కోసం రోజులో కనీసం అరగంట సేపు శరీరానికి ఎండ తగలనివ్వాలి. ఎండలో ఎక్కువ సమయం వెచ్చిస్తే మచ్చ ముదురు రంగులోకి మారుతుంది. కాబట్టి మచ్చ పై తప్పనిసరిగా సన్‌ స్ర్కీన్‌ రాసుకుని మాత్రమే ఎండలో సమయం గడపాలి. మీ మచ్చ తగ్గించుకునేందుకు ఏ ప్రక్రియ సరైనదో చర్మవైద్యులని సంప్రదించి తెలుసుకోండి. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-02-04T17:29:09+05:30 IST