ఎత్తు పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ABN , First Publish Date - 2021-07-09T18:17:57+05:30 IST

సాధారణంగా ఎత్తు అనేది వంశపారంపర్య లక్షణం. అయితే మీరు ఎదిగే వయసులో ఉన్నారు. కాబట్టి ఆహారం, నిద్ర విషయంలో సరైన జాగ్రత్తలు పాటించాలి. ఎత్తుపెరగడానికి ముఖ్యమైంది ఎముకల ఆరోగ్యం. దీనికోసం ఆహారంలో ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్‌- డి సరైన మోతాదుల్లో

ఎత్తు పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ఆంధ్రజ్యోతి(09-07-2021)

ప్రశ్న: నాకు పదహారేళ్లు. ఎత్తు పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?


- కార్తీక్‌, అనంతపూర్‌


డాక్టర్ సమాధానం: సాధారణంగా ఎత్తు అనేది వంశపారంపర్య లక్షణం. అయితే మీరు ఎదిగే వయసులో ఉన్నారు. కాబట్టి ఆహారం, నిద్ర విషయంలో సరైన జాగ్రత్తలు పాటించాలి. ఎత్తుపెరగడానికి ముఖ్యమైంది ఎముకల ఆరోగ్యం. దీనికోసం ఆహారంలో ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్‌- డి సరైన మోతాదుల్లో తీసుకోవాలి. ప్రొటీన్ల కోసం గుడ్లు, మాంసం, చేపలు, పాలు, పెరుగు, పప్పుధాన్యాలు, బాదం, ఆక్రోట్‌, పిస్తా లాంటి గింజలు తీసుకోవచ్చు. ఆకుకూరలు, పాలు, పెరుగు, పనీర్‌ మొదలైన ఆహారపదార్థాల్లో కాల్షియం ఉంటుంది. రోజుకు కనీసం అరలీటరు నుండి ముప్పావు లీటర్‌ పాలు లేదా పాల పదార్థాలు తీసుకుంటే సరిపడా కాల్షియం లభిస్తుంది. విటమిన్‌- డి కోసం అరగంట సమయం ఎండలో తిరిగితే సరిపోతుంది. రోజూ కనీసం రెండు వేల కెలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకుంటే మీరు ఎత్తు మాత్రమే కాక తగినంత బరువు పెరిగేందుకూ అవకాశం ఉంటుంది. ఇలా ఆహారంలో జాగ్రత్తలతో పాటు వ్యాయాయం కూడా చేస్తే మరింత ఉపయోగం. రోజుకు ముప్పై నుండి అరవైనిమిషాల పాటు వేగంగా నడవడం, పరిగెత్తడం, ఏదైనా ఆటలు ఆడడం లాంటివి చేయండి. ప్రతి రాత్రీ కనీసం ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-07-09T18:17:57+05:30 IST