ఎంత తిన్నా బరువు పెరగడం లేదు.. ఏం చేస్తే బరువు పెరగొచ్చు?

ABN , First Publish Date - 2022-06-02T22:29:33+05:30 IST

నేను ఎంత తిన్నా బరువు పెరగడం లేదు. బరువు పెరగడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి

ఎంత తిన్నా బరువు పెరగడం లేదు.. ఏం చేస్తే బరువు పెరగొచ్చు?

ఆంధ్రజ్యోతి(02-06-2022)

ప్రశ్న: నేను ఎంత తిన్నా బరువు పెరగడం లేదు. బరువు పెరగడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?


- కార్తికేయ, రాజమండ్రి 


డాక్టర్ సమాధానం: బరువు పెరగాలి అంటే మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారం తీసుకోవాలి. అయితే ఈ ఆహారం ఆరోగ్యవంతమైనది కాకపోతే బరువు పెరగడంతో పాటు అనారోగ్యం తోడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి బాగా వేయించిన ఆహారం, ఎక్కువ తీపి పదార్థాలు, ఎక్కువ కొవ్వులు ఉన్న మాంసం లాంటి వాటిని పరిమితంగానే తీసుకోవాలి. మీ బరువు నెలకు రెండు నుంచి మూడు కేజీల వరకు పెరగాలంటే, రోజుకు అరలీటరు పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవాలి.  రెండు గుడ్లు, రెండు వందల గ్రాముల చికెన్‌ లేదా చేప కూడా  తీసుకోవచ్చు. వీటన్నింటితో పాటు, కనీసం రెండు, మూడు కప్పుల కాయగూరలు లేదా ఆకుకూరలు తీసుకోవాలి. అంతేకాకుండా రోజులో రెండు సార్లు స్నాక్స్‌గా పళ్ళు, బాదం, ఆక్రోట్‌ లాంటివి తీసుకోవాలి. గుప్పెడు వేరుశెనగపప్పు కూడా తీసుకుంటే మంచిదే. ఈ జాగ్రత్తలతో పాటు  అరగంట వ్యాయామానికి కూడా కేటాయిస్తే తీసుకున్న ఆహారం బాగా వంట బట్టి, బరువు పెరగడానికి ఉపయోగ పడుతుంది. అయితే ఈ విషయంలో నిద్ర కూడా చాలా అవసరం. రోజుకు కనీసం ఎనిమిది గంటల నిద్ర మంచిది. కానీ రాత్రి భోజనం వెంటనే కాకుండా కనీసం రెండు గంటల విరామం తరువాత నిద్రకు ఉపక్రమిస్తే మంచిది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-06-02T22:29:33+05:30 IST