రూట్‌ చేస్తే వాటికెలా తెలుస్తుంది

ABN , First Publish Date - 2020-09-19T05:30:00+05:30 IST

మీరు వాడే ఆండ్రాయిడ్‌ ఫోన్‌ని రూట్‌ చేయడం వల్ల హ్యాకింగ్‌ ఇబ్బందులు మాత్రమే కాకుండా హార్డ్‌వేర్‌ పరంగానూ అనేక

రూట్‌ చేస్తే  వాటికెలా తెలుస్తుంది

ఫోన్‌ రూట్‌ చేస్తే వారెంటీ పోతుంది అంటారు. మనం రూట్‌ చేశామన్న విషయం సర్వీస్‌ సెంటర్‌కి ఎలా తెలుస్తుంది? 

- రాజశేఖర్‌


మీరు వాడే ఆండ్రాయిడ్‌ ఫోన్‌ని రూట్‌ చేయడం వల్ల హ్యాకింగ్‌ ఇబ్బందులు మాత్రమే కాకుండా హార్డ్‌వేర్‌ పరంగానూ అనేక సమస్యలు ఏర్పడతాయి. అందుకే ఫోన్‌ రూట్‌ చేసిన యూజర్లు  సమస్యలను స్వయంగా కొని తెచ్చుకుంటున్నారు. ఆ కారణాన్ని సాకుగా చూపించి వాటిని సర్వీస్‌ చేయటానికి సంబంధిత సెంటర్లు అనుమతించవు. అలాంటప్పుడు మీకు వారంటీ ఉన్నా ఎలాంటి ఉపయోగం ఉండదు.


అయితే ఫోన్‌ రూట్‌ చేసిన తరవాత, దాన్ని మళ్ళీ ఆన్‌ రూట్‌ చేసే పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయి. అందువల్ల కొంతమంది వినియోగదారులు ఆ పద్ధతిని ఉపయోగించి ఫోన్‌ నార్మల్‌ కండిషన్‌లో ఉందనే భ్రమ కలిగించడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇక్కడ శాంసంగ్‌ వంటి ఫోన్లలో నాక్స్‌ కౌంట్‌ అనీ, ఇతర ఫోన్లలో ఇతర పేర్లతోనూ అంతర్గతంగా ఫోన్‌ బూట్‌ లోడర్‌ జోలికి ఎవరైనా వెళ్లారా లేదా అన్నది సర్వీస్‌ సెంటర్‌ సిబ్బంది తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని ఏమార్చడం చాలా కష్టం.


Updated Date - 2020-09-19T05:30:00+05:30 IST