రేషన్‌ కోసం ఎంత కష్టం

ABN , First Publish Date - 2021-03-05T05:29:49+05:30 IST

రేషన్‌ కోసం వినియోగదారులు ఎండల్లో అవస్థలు పడుతున్నారు. ఇంటింటికీ రేషన్‌ సరుకుల పథకం లబ్ధిదారుల సహనాన్ని పరీక్షిస్తోంది. గతంలో వీలు చిక్కినప్పుడు డీలర్‌ వద్దకు వెళ్లి తెచ్చుకునేవారు. నేడు వాహనం వచ్చినప్పుడు వీలు కల్పించుకుని వెళ్లాల్సి వస్తోంది. మండు వేసవిని తలపించేలా ఎండలు కాస్తుండడంతో సూర్య ప్రతాపానికి విలవిల్లాడుతున్నారు.

రేషన్‌ కోసం ఎంత కష్టం
రేషన్‌ వాహనం వద్ద నిరీక్షిస్తున్న కార్డుదారులు

ఎండలో నిరీక్షణ

విజయనగరం (ఆంధ్రజ్యోతి)/శృంగవరపుకోట రూరల్‌, మార్చి 4: రేషన్‌ కోసం వినియోగదారులు ఎండల్లో అవస్థలు పడుతున్నారు. ఇంటింటికీ రేషన్‌ సరుకుల పథకం లబ్ధిదారుల సహనాన్ని పరీక్షిస్తోంది. గతంలో వీలు చిక్కినప్పుడు డీలర్‌ వద్దకు వెళ్లి తెచ్చుకునేవారు. నేడు వాహనం వచ్చినప్పుడు వీలు కల్పించుకుని వెళ్లాల్సి వస్తోంది. మండు వేసవిని తలపించేలా ఎండలు కాస్తుండడంతో సూర్య ప్రతాపానికి విలవిల్లాడుతున్నారు. రేషన్‌ కావాలంటే భారీ క్యూలలో వేచి ఉండక తప్పడం లేదు. మరోవైపు ఇంటివద్దకు సరుకుల సంగతి అలా ఉంచితే మున్సిపల్‌ ఎన్నికల్లో రేషన్‌ సరుకుల డోర్‌డెలివరీ వ్యాన్‌లు ప్రభుత్వానికి ప్రచారాస్త్రాలుగా మారాయనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. విజయనగరంలో సీఎం ఫొటోతో కూడిన రేషన్‌ సరుకుల వాహనాలు నిత్యం చక్కెర్లు కొడుతున్నాయి. కోడ్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు. 

ఎస్‌.కోట మండలంలోని పలు పంచాయతీల్లో జరుగుతున్న రేషన్‌పంపిణీపై లబ్ధిదారులు విసిగిపోతున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ఈ వాహనాలకు అమర్చిన నెట్‌ సహకరించడం లేదు. సిగ్నల్స్‌ లేక ఎలకా్ట్రనిక్‌ కాటాలు పనిచేయక పేదలు రోడ్డుపై ఎక్కువ సమయం నిరీక్షిస్తుండడం మామూలైపోయింది. ఇదే దృశ్యం వినాయకపల్లిలో గురువారం కనిపించింది. రేషన్‌ పంపిణీ తీరుపై వారంతా తీవ్రంగా మండిపడ్డారు.  




Updated Date - 2021-03-05T05:29:49+05:30 IST