Rajasthan: చోరీ చేసి పారిపోతున్న దొంగలను పోలీసులకు పట్టించిన కారు డ్రైవర్.. అతడు ఎలా ప్లాన్ చేశాడంటే..

ABN , First Publish Date - 2022-09-21T23:37:53+05:30 IST

జైపూర్‌లోని ఓ డాక్టర్ ఇంట్లో చోరీకి పాల్పడి తప్పించుకునేందుకు ప్రయత్నించిన దుండగులను ఓ క్యాబ్ డ్రైవర్ పట్టుకున్నాడు

Rajasthan: చోరీ చేసి పారిపోతున్న దొంగలను పోలీసులకు పట్టించిన కారు డ్రైవర్.. అతడు ఎలా ప్లాన్ చేశాడంటే..

జైపూర్‌లోని ఓ డాక్టర్ ఇంట్లో చోరీకి పాల్పడి తప్పించుకునేందుకు ప్రయత్నించిన దుండగులను ఓ క్యాబ్ డ్రైవర్ పట్టుకున్నాడు. దుండగులను జైపూర్ నుంచి భరత్‌పూర్‌కు తీసుకెళుతూ వారి గురించి తెలుసుకున్నాడు. భయపడకుండా వారిని నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. పోలీసులకు పెద్ద సహాయం చేశాడు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. సోమవారం ఏం జరిగిందో క్యాబ్ డ్రైవర్ రామజనం గుర్జర్ (32) తాజాగా వివరించాడు. 


ఇది కూడా చదవండి..

Minor Girl: మైనర్ బాలికను అపహరించి సామూహిక అత్యాచారం.. గొంతు కోసి చంపేందుకు ప్రయత్నం.. చివరకు..


`సోమవారం సాయంత్రం 4 గంటలకు జోత్వారాలో నా క్యాబ్‌లో కూర్చున్నాను. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు నా కారు దగ్గరకు వచ్చారు. సురేష్ షాహి అనే వ్యక్తి తమను ఆగ్రా తీసుకెళ్లాలని చెప్పాడు. ఆగ్రా వెళ్లేందుకు నిరాకరించాను. దీంతో వారు ఆగ్రా కాకపోతే భరత్‌పూర్‌ వరకైనా తీసుకెళ్లమన్నారు. తమ బంధువు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని, త్వరగా తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో నేను రూ.5800కు బేరం మాట్లాడుకుని  సాయంత్రం 4.30 గంటలకు ఇద్దరితో కలిసి భరత్‌పూర్‌కి బయలుదేరాను. మేము మహువా సమీపంలోని ఖండేల్వాల్ ధాబాలో టీ తాగాము. ఇద్దరూ నాతో పాటు కూర్చుని టీ తాగారు. ఆ సమయంలో కూడా నేను వారిని అనుమానించలేదు. 


ఆ తర్వాత కారులో కొద్ది దూరం వెళ్లాక ఓ నిర్మానుష్య ప్రదేశంలో వారు నన్ను మూత్ర విసర్జన కోసం అని చెప్పి కారు ఆపమన్నారు. నేను కారు ఆపిన తర్వాత సురేష్ కిందకు దిగి కొంత దూరం వెళ్లాడు. అక్కడ తన సెల్‌ఫోన్‌ను రాయితో పగలగొట్టి దూరంగా విసిరేశాడు. దాంతో నాకు అనుమానం వచ్చింది. ఈ వ్యక్తులిద్దరూ పెద్ద నేరగాళ్లు అని అర్థం చేసుకున్నాను. కొద్ది సేపటి తర్వాత సురేష్‌ను పిలవడానికి మరో వ్యక్తి కారు దిగాడు. వారు నిందితులని తెలిసిన తర్వాత నేను భయపడ్డాను. వారిని అక్కడే వదిలేసి పారిపోవాలనుకున్నాను. కొంచెం సేపటి తర్వాత వారిద్దరినీ పోలీసులకు పట్టించాలని నిర్ణయించుకున్నాను. ఇద్దరూ తిరిగి కారు ఎక్కి నేపాలీ భాషలో మాట్లాడుకున్నారు. గమ్యస్థానానికి వెళ్లేందుకు షార్ట్ కట్ ఉందని చెప్పి వారిని నమ్మించి కారును సెవర్ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లాను. 


రాత్రి 9.40 గంటలకు కారును సెవర్ పోలీస్ స్టేషన్‌లోకి తీసుకెళ్లాను. కారు అకస్మాత్తుగా ప్రవేశించడంతో, సెంట్రీ పోలీసులు ఆశ్చర్యపోయారు. నేను పోలీస్ స్టేషన్‌లోకి కారును తీసుకెళ్లినట్టు గుర్తించి దుండగులు కారు దిగి పారిపోయారు. అక్కడ 6-7 మంది పోలీసులు నిలబడి ఉన్నారు. కానీ ఎవరూ దుండగులను ఆపలేదు. అనంతరం కారును సోదా చేయగా.. వారి బ్యాగ్‌లో రూ. 6 లక్షల విలువైన బంగారం, కత్తి లభించాయి. విషయం అర్థం చేసుకున్న పోలీసులు నిందితుల గురించి అన్వేషణ ప్రారంభించారు. మధ్యాహ్నం 1 గంటకు ఆ అగంతకులను పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత ఏఎస్పీ నాతో ఫోన్‌లో మాట్లాడారు. నా ధైర్యాన్ని మెచ్చుకున్నార`ని రామజనం గుర్జర్ చెప్పాడు. 

Updated Date - 2022-09-21T23:37:53+05:30 IST