Advertisement
Advertisement
Abn logo
Advertisement

జుట్టు ఎక్కువగా రాలడానికి కారణం ఇదన్నమాట!

ఆంధ్రజ్యోతి(9-02-2020)

ప్రశ్న: నాకు ఇరవై మూడేళ్లు. చాలా రోజుల నుండి జుట్టు ఎక్కువగా రాలుతోంది. నా సమస్యకు పరిష్కారం తెలపండి. 

- శైలజ, నంద్యాల

జవాబు: వాడే షాంపూలకన్నా... తీసుకునే ఆహారం ద్వారానే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. జుట్టు ఆరోగ్యానికి ప్రొటీన్లు ఎంతో అవసరం. ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న చికెన్‌, చేప, గుడ్ల్లతో పాటు పాలు, పెరుగు, పప్పు ధాన్యాలు ఎక్కువగా తీసుకోండి. ఐరన్‌, జింక్‌, సెలీనియం ఖనిజాలు లభించే మాంసాహారంతో పాటు కందులు, పెసలు, మినుములు లాంటి పప్పు ధాన్యాలు; బాదం, పిస్తా, వాల్నట్స్‌, అవిసె గింజలూ మంచివే. వీటి వల్ల ఆరోగ్యకరమైన జుట్టుకు అవసరమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కొంత వరకు లభిస్తాయి. విటమిన్‌-డి తక్కువగా ఉన్నా జుట్టు రాలుతుంది. దీని కోసం వైద్యుల సలహా మేరకు విటమిన్‌-డి సప్లిమెంట్స్‌ వాడొచ్చు. రోజూ ఇరవై నిమిషాలు ఎండలో గడిపినా విటమిన్‌-డిని పొందవచ్చు. నిద్రలేమి కూడా జుట్టు రాలడానికి కారణం. నిద్ర సమయానికి కనీసం రెండు గంటల ముందే ఆహారం తీసుకోవడం; గంట ముందు ఫోను, టీవీ తదితర ఎలకా్ట్రనిక్‌ పరికరాలను ఆపివేయడం; నిద్రపోయేముందు మెడిటేషన్‌ చేయడం లేదా ఏదైనా పుస్తకం చదవడం మంచిది. రోజూ కనీసం ఏడు గంటలైనా నిద్ర పోవాలి. ఆందోళన లేని జీవితం మీ సమస్యను బాగా తగ్గిస్తుంది.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను [email protected] కు పంపవచ్చు)

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement