Advertisement
Advertisement
Abn logo
Advertisement

మానసిక ప్రశాంతత కోసం..

ఆంధ్రజ్యోతి(20-04-2020)

ఇంట్లోనే... ఇలా...

వ్యాయామం ఎందుకు? చాలామంది వేసే ప్రశ్నే ఇది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటుందో తెలుసా? చాలా మరణాలకు కారణం సరియైున శారీరక వ్యాయామం లేకపోవడమేనని చెబుతోంది. నూటికి 80 మంది తగినంత శారీరక వ్యాయామం చేయడం లేదట!


అందుకే, ఫిట్‌నెస్‌ విషయంలో చేస్తున్న కొన్ని సూచనలు...


ఎంత సేపు చేయాలి?

రోజంతా చురుకుగా ఉండాలి. శరీరం, మనస్సు క్రియాశీలంగా ఉండేలా చూసుకోవాలి. 


రోజూ అరగంటపాటు శారీరక వ్యాయామం చేయాలి.


పిల్లలు రోజూ గంటపాటు శారీరకంగా చురుకుగా ఉండాలి. ఆటలు ఆడడం, పరుగెత్తడం ఇలా... ఎలా అయినా ఓ గంటపాటు శారీరక వ్యాయామం జరగాలి.


శారీరక వ్యాయామం కోసం...

మెట్లు ఎక్కడం, దిగడం చేయవచ్చు.


స్ట్రెచింగ్‌ వ్యాయామాలు ఎంచుకోవచ్చు.


మ్యూజిక్‌ పెట్టుకుని డ్యాన్స్‌ చేయండి.


యాక్టివిటీ ఏదైనా మంచి నిద్రను ఇవ్వాలి. తద్వారా ఆరోగ్యం పెంపొందాలి.


కూర్చొనే విధానం...

ఇంట్లో పనిచేసే సమయంలో ఎలా కూర్చుంటున్నారో చెక్‌ చేసుకోండి..


ఎక్కువ సమయం కూర్చొని పనిచేయకండి. అలాగే టీవీ చూడకండి. మధ్యమధ్యలో కాసేపు లేచి అటూ ఇటూ తిరగండి.


ఎక్కువ సమయం కూర్చొని పనిచేయాల్సి వచ్చినప్పుడు ప్రతి అరగంటకొకసారి బ్రేక్‌ తీసుకుంటూ చిన్న చిన్న వ్యాయామాలు చేయండి.


టీవీ చూస్తూ...

ఆన్‌లైన్‌లో వ్యాయామ క్లాసులను ఒకసారి ట్రై చేయండి.


మ్యూజిక్‌ పెట్టుకొని కాసేపు డ్యాన్స్‌ చేయవచ్చు.


మానసిక ప్రశాంతత కోసం..

యోగాసనాలు వేయండి.


బ్రీతింగ్‌ వ్యాయామాలు చేయడం మరువద్దు.


కాసేపు ధ్యానం చేయండి.


కుటుంబ సభ్యులతో గడపండి.

Advertisement
Advertisement