‘రేవ్ పార్టీకి సంబంధించి వాట్సప్ చాటింగ్‌లో అసలే లేదు. అర్బాజ్ మర్చంట్ వద్ద చాలా తక్కువ మోతాదులో మాదకద్రవ్యాలు దొరికాయి. వాస్తవానికి అతడిని అరెస్ట్ చేయనక్కర్లేదు. నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని చెప్పవచ్చు. కానీ దీన్ని పెద్ద ఇష్యూ చేశారు..’ అంటూ ముంబై హైకోర్టులో అర్బాజ్ మర్చంట్ తరపున వాదిస్తున్న లాయర్ అమిత్ దేశాయ్ వాపోయారు. ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్ బెయిల్ పిటిషన్లపై మంగళవారం వాదనలు జరిగిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా బుధవారం కూడా ఈ బెయిల్ పిటిషన్‌పై ముంబై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. మంగళవారం ఆర్యన్ ఖాన్ తరపు లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఆ తర్వాత ఆర్యన్ ఖాన్ స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ తరపున అమిత్ దేశాయ్ వాదనలు మొదలు పెట్టారు. అయితే కోర్టు సమయం ముగియడం వల్ల వాయిదా పడింది. బుధవారం మధ్యాహ్నం సమయంలో ఈ పిటిషన్‌పై మళ్లీ వాదనలు మొదలయ్యాయి. అమిత్ దేశాయ్ మొదట వాదనలు మొదలు పెట్టారు. అరెస్ట్ సమయంలో తన క్లయింట్ వద్ద అతి తక్కువ మోతాదులో మాదకద్రవ్యాలు ఉన్నాయనీ, అయితే అది బెయిల్‌కు అనర్హమయినంత స్థాయిలో మాత్రం కాదని అమిత్ దేశాయ్ స్పష్టం చేశారు.
సీనియర్ లాయర్ అమిత్ దేశాయ్ (ఫైల్ ఫొటో) పార్టీ జరుగుతున్న రోజు కూడా వాళ్లిద్దరూ విడివిడిగానే వచ్చారని అమిత్ దేశాయ్ గుర్తు చేశారు. ‘నా క్లయింట్‌ను అక్రమంగానే అరెస్ట్ చేశారు. అతి తక్కువ మోతాదులో మాదకద్రవ్యాలు దొరికితే అరెస్ట్‌కు మినహాయింపు ఉంది. నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు అవమని కోరవచ్చు. కానీ అదేం చేయలేదు. అక్రమంగా అరెస్ట్ చేశారు.’ అంటూ గతంలో ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ తీర్పును అమిత్ దేశాయ్ చదివి వినిపించారు. అరెస్ట్ మెమోలో డ్రగ్స్ తీసుకున్నారు అని ఉంది తప్పితే.. తన క్లయింట్‌పై ఇతర కేసులు ఏమీ లేవని చెప్పుకొచ్చారు. అసలు నిందితుల వాట్సప్ చాటింగ్‌లు కోర్టు వద్దకు చేరకముందే మీడియాకు ఎలా వెళ్తున్నాయని ప్రశ్నించారు. తన క్లయింట్‌కు బెయిల్ ఇచ్చి విచారణను కొనసాగించుకోవచ్చని కోరారు. కేవలం ఒక్క ఏడాది మాత్రమే శిక్ష పడే చిన్న కేసులోనే తాను బెయిల్ అడుగుతున్నట్టు గుర్తు చేశారు. కాగా, అంతకుముందు మంగళవారం ఆర్యన్ ఖాన్ తరపున వాదించిన ముకుల్ రోహత్గీ తన క్లయింట్ వద్ద అసలు ఏమీ దొరకలేదని గుర్తు చేశారు. పక్కన ఉన్న వాళ్ల వద్ద దొరికితే ఆర్యన్ ఖాన్‌కు ఏం సంబంధమని వాదించారు. ఆ క్రూయిజ్ పార్టీకి ఆర్యన్ ఖాన్ గెస్ట్‌గా వచ్చాడు తప్పితే.. అక్కడ డ్రగ్స్ తీసుకోవడానికి రాలేదని చెప్పుకొచ్చారు. ఎన్సీబీ అధికారులు చూపిస్తున్న వాట్సప్ చాట్లు ఆరు నెలల క్రితం నాటివనీ.. అసలు క్రూయిజ్ పార్టీ గురించి వాట్సప్ చాటింగ్స్లోనే లేదన్నారు.