మాకు తెలియకుండా నిధులు ఎలా డ్రా చేస్తారు?

ABN , First Publish Date - 2021-10-19T05:18:48+05:30 IST

తమకు తెలియకుండా పంచాయ తీ నిధులు ఎలా డ్రా చేస్తారని వా ర్డుసభ్యులు ప్రశ్నించారు.

మాకు  తెలియకుండా నిధులు ఎలా డ్రా చేస్తారు?
పంచాయతీ కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న వార్డు సభ్యులు

- సర్పంచ్‌, కార్యదర్శితో వార్డు సభ్యుల వాగ్వాదం  

మహమ్మదాబాద్‌ అక్టోబరు 18: తమకు తెలియకుండా పంచాయ తీ నిధులు ఎలా డ్రా చేస్తారని వా ర్డుసభ్యులు ప్రశ్నించారు. దాంతో సర్పంచ్‌, కార్యదర్శి, వార్డు సభ్యుల కు మాటామాట పెరగడంతో వా గ్వాదానికి దిగారు. సోమవారం మ హమ్మదాబాద్‌ గ్రామపంచాయతీ కార్యాలయంలో పాలకవర్గ  సమా వేశాన్ని నిర్వహించారు.  ఈ సంద ర్భంగా  సభ్యులు మాట్లాడుతూ  మహమ్మదాబాద్‌ గ్రామపంచాయ తీకి 2018-20 సంవత్సరానికి సంబంధించి తాగునీరు సరఫరా చేసిందుకు రూ.19లక్షలు మం జూరు కాగా, సభ్యులకు సమాచారం ఇవ్వకుండా రూ. 6.50లక్షలు ఎలా డ్రా చేస్తారని ప్ర శ్నించారు.  సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. దాంతో సర్పంచ్‌,  గ్రామకార్యదర్శి  కార్యాల యానికి తాళం వేసుకొని వెళ్లిపోవడంతో ఐదుగురు వార్డుసభ్యులు కార్యాలయం ముందు ని రసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వార్డు మెంబరు, పంచాయతీ చెక్‌పవర్‌ స్పెస్‌మెన్‌ స భ్యుడు అశోక్‌  మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో 14మంది వార్డు సభ్యులు ఉన్నరని, అం దులో ఎన్నికల సంఘం ఆదే శాల మేరకు ఎనిమిదిమంది వార్డు సభ్యులను తొలగించార న్నారు.  ఆందులో ఆరుగురు  మాత్రమే సభ్యులుగా కొనసాగుతున్నారని, ప్రభుత్వ నిబంధన ల ప్రకారం కలెక్టర్‌, డీపీవోలు తనకు స్పెస్‌మెన్‌ సిగ్నిచర్‌కు సంబందించి ఉత్తర్వులు  ఇ చ్చారన్నారు. తనకు తెలియకుండా నిధులను పంచాయతీ  కార్యదర్శి బావమరిది కౌసిక్‌ రెడ్డి పేరు మీదా డ్రా చేసినట్లు  తెలి యడంతో వివరాలు ఇవ్వాలని అడిగితే గ్రామకార్యదర్శి స మాచార హక్కు చట్టం కింద తీసు కోవాలని సూచిస్తున్నారని తెలిపారు. దీనిపై  కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నామన్నారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్‌రెడ్డిని వివరణ కోరగా నిధులు తన బావమరిది కౌసిక్‌రెడ్డి పేరు మీదా డ్రా చేసిన మాట వాస్తవమే నన్నారు.  తన బావమరిది, సర్పంచ్‌ భర్త రాజేశ్వర్‌కు ఉన్న పరిచయంతోనే నిధులను కౌసిక్‌ రెడ్డి  అకౌంట్‌లో వేసి ఉండవచ్చని చెప్పారు. 

Updated Date - 2021-10-19T05:18:48+05:30 IST